బాపట్ల: పంగులూరు మండల కేంద్రంలోని APM వెలుగు కార్యాలయ మీటింగ్ హాల్లో జనగణన-2027 (Census 2027) శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తహసీల్దార్ సింగారావు మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లకు క్షేత్రస్థాయిలో డేటా సేకరణపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు నేటి నుంచి మూడు రోజుల పాటు జరుగుతాయని, అన్నారు.
గుంటూరు: జిల్లాలో పలువురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఎస్పీల ప్యానెల్ జాబితాలో గుంటూరులో పనిచేస్తున్న పలువురు అదనపు ఎస్పీల పేర్లు ఉన్నాయి. గుంటూరు క్రైమ్స్ అదనపు ఎస్పీ కే. సుప్రజ, ఎల్ అండ్ ఓ అదనపు ఎస్పీ ఏ.టీ.వి రవికుమార్, అడ్మిన్ అదనపు ఎస్పీ జీ.వీ. రమణమూర్తి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ‘ప్రజా దర్బార్’ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఎమ్మెల్యే ఫిర్యాదుల స్వీకరించారు. సమస్యను సంబంధిత అధికారికి బదిలీ చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.
ASR: నాటు సారా కేసుల్లో నలుగురు పాత ముద్దాయిలను ఎక్సైజ్ అధికారులు గురువారం అరెస్టు చేశారు. దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి మండలాల్లో పాత కేసులకు సంబంధించి వీరిని పట్టుకున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. నాటు సారా వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలో బ్యాక్లాగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగించారు. గురువారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెల 15 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. వివిధ శాఖల్లో 38 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన విభిన్న ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్గదర్శకాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.
ATP: పుట్లూరు జెడ్పీ హైస్కూల్‌ను ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, మెరుగైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులు, బస్సుల కొరత, ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వీటిని పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
NLR: దక్షిణ తీర ప్రాంతాలైన తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల మత్స్యకారులుతో గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. నెల్లూరు టౌన్ హాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పలు అంశాలపై చర్చించనున్నారు. మత్స్యకారుల రక్షణతో పాటు సముద్ర తీరాల భద్రతపై కలెక్టర్ సూచనలు ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడనున్నారు.
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద వేదాంత ఆయిల్ కంపెనీ ఎదుట నిరుద్యోగ యువత బుధవారం రాత్రి రోడ్డుపై పడుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న యాజమాన్యం స్పందించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. యాజమాన్యం దిగి రాకపోతే మూడవ రోజు కూడా కంపెనీ కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
E.G: నిడదవోలు RTC డిపో అభివృద్ధికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని RTC డిపో సాధన సౌకర్యాల పోరాట కమిటీ కన్వీనర్ జువ్వల రాంబాబు విమర్శించారు. గురువారం నిడదవోలులో ఆయన మాట్లాడుతూ నిడదవోలు డిపోలో 2006 సంవత్సరానికి ముందు 78 బస్సులు ఉండేవని కానీ ఇప్పుడు 34 బస్సులు మాత్రమే ఉన్నాయన్నారు. అందులో సగం కాలం చెల్లిన బస్సులు తిప్పుతున్నారన్నారని ఆయన పేర్కొన్నారు.
CTR: మరమ్మతుల్లో భాగంగా పీలేరులోని ఎల్బీఎస్ రోడ్డులో రైల్వే గేట్ మూసివేశారు. ఈ నేపథ్యంలో సదుం నుంచి పీలేరుకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీస్ రూట్ మార్చారు. రైల్వే స్టేషన్, డిగ్రీ కాలేజ్, మదనపల్లె జాతీయ రహదారి మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.
SKLM: జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో గ్రామ కమిటీల పరిచయ వేదిక కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ గురువారం నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను గుర్తుచేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి డైవర్సన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలుపించుకోవాలని సూచించారు.
CTR: జిల్లాలో పాడి రైతులకు పశు పోషణ భారంగా మారింది. గతంలో పొలాల వద్ద పచ్చిగడ్డి విరివిగా లభించేది. ప్రస్తుతం వేసవి కావడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. లభ్యత లేకపోవడంతో వరిగడ్డిని ఇతర జిల్లాల నుంచి రవాణా చేసుకుంటున్నారు. వాటికి అధికంగా డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం ట్రాక్టర్ వరి గడ్డి రూ. 20 వేలు పలుకుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు.
GNTR: వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. స్థానిక రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 170 బస్తాల పీడీఎఫ్ బియ్యంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రేషన్ కోసం సరఫరా చేయాల్సిన ఈ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
KRNL: మహిళా ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని UTF మండల ప్రధాన కార్యదర్శి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ కోసిగి మం. జంపాపురం, సజ్జలగూడెం పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో సుమారు 50 శాతం మహిళలే ఉన్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలన్నారు.
కోనసీమ: జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఎం.రంగారావు ఎన్నికయ్యారు. అమలాపురంలో గురువారం జరిగిన జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో రంగారావుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వై.సాయి వెంకట రమణారావు, ఉపాధ్యక్షులుగా నరేంద్ర కుమార్, కార్యదర్శిగా రాయుడు సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా టి.మమత బాధ్యతలు స్వీకరించారు.