• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుమ్మలక్ష్మీపురంలో కార్డన్ సెర్చ్

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని పిల్లిగూడ, మాసాడగూడ గ్రామాల్లో పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. 240 మంది, 54 వాహనాలు తనిఖీ చేసి, 5 వాహనాలు సీజ్ చేశారు. 350 లీటర్ల నాటు సారా తయారీ ఊటను ధ్వంసం చేసి, అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 4, 2026 / 03:42 PM IST

ఘనంగా జాతీయ విటమిన్ సి దినోత్సవం

W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో జాతీయ విటమిన్ ‘సి’ దినోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. MLHP మేడిది అనిత మాట్లాడుతూ.. మానవులలో రోగనిరోధక శక్తిని పెంపొందించుటలో ‘సి’ విటమిన్ పాత్ర, ఉపయోగాలను, లభ్యమయ్యే వనరులను గురించి విద్యార్థులకు అవాహన కల్పించారు.హెచ్‌ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ ఆధ్వర్యంలో ‘సి’ విటమిన్ ఉండే పండ్లను పాఠశాలలో ప్రదర్శించారు.

April 4, 2026 / 03:33 PM IST

బీఆర్ నాయుడుని తొలగించాలని డిమాండ్

ప్రకాశం: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తొలగించాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శిలోని పొదిలి రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు ఉన్నారు.

April 4, 2026 / 03:30 PM IST

గుంటూరులో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ ర్యాలీ

GNTR: గుంటూరు వెస్ట్ పారిష్ చర్చి వద్ద నుంచి ప్రారంభమైన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

April 4, 2026 / 03:30 PM IST

గాలివీడు పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య: గాలివీడు పీహెచ్‌సీని కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేసి, సిబ్బంది గైర్హాజరు, మందుల నిల్వ, పరిశుభ్రతలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశించారు. లేబర్ రూమ్‌లో అత్యవసర మందులు సక్రమంగా లేవని గుర్తించి, వెంటనే అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలు ప్రాధాన్యమని తెలిపారు.

April 4, 2026 / 03:30 PM IST

TTD ఛైర్మన్ను తొలగించాలని డిమాండ్

CTR: పూతలపట్టు నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పాలేరు హైవే సాయిబాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 4, 2026 / 03:26 PM IST

ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి పోలీసుల నోటీసులు

KDP: బద్వేల్ టౌన్‌లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలగింపునకు డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని పోరుమామిళ్ల పోలీసులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దృక్పథంతో జరుగుతుందని ఆయన ప్రకటించారు.

April 4, 2026 / 03:21 PM IST

‘బీజేపీ జెండా ప్రతీ గ్రామంలో రెపరెపలాడాలి’

E.G: రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులతో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులతో ఏప్రిల్ 6వ తేదీన జరగబోయే పార్టీ 47వ స్థాపన దినోత్సవం కార్యక్రమాలపై చర్చించారు. దేశ ప్రయోజనాల కోసం పనిచేసే బీజేపీ జెండా ప్రతీ గ్రామంలో రెపరెపలాడాలని ఆయన పిలుపునిచ్చారు.

April 4, 2026 / 03:20 PM IST

ప్రభుత్వ పాఠశాలలో విటమిన్-C ప్రాముఖ్యతపై అవగాహన

NLR: వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ విటమిన్-C దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విటమిన్-C ఉపయోగాలు, దాని ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిమ్మ, ఆరెంజ్, ఉసిరి వంటి సిట్రస్ జాతి ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

April 4, 2026 / 03:20 PM IST

జనవాణి కార్యక్రమంలో 52 వినతులు

TPT: తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మొత్తం 52 వినతులు అందాయి. కార్పొరేషన్ ఇంజనీరింగ్ (11), రెవెన్యూ (13), కమిషనర్ (11) తదితర విభాగాలకు చెందిన సమస్యలు ప్రధానంగా వచ్చాయి. ప్రజల సమస్యల త్వరగా పరిష్కారానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

April 4, 2026 / 03:20 PM IST

కొత్తగూడెం గ్రామ ప్రత్యేక అధికారిగా బి సుమతి

ELR: దెందులూరు మండలములోని కొత్తగూడెం గ్రామ ప్రత్యేక అధికారిగా శనివారం బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ సుమతి సిబ్బంది, గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. గ్రామములో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయములో సిబ్బంది వివరములు, హాజారు నమోదు గురించి ఆరా తీసారు. గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్ సమీక్షించారు.

April 4, 2026 / 03:20 PM IST

అధికారులు, నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే

ATP: అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ తన క్యాంప్ కార్యాలయం నుంచి వివిధ వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. పలు పనుల నిమిత్తం వచ్చిన అధికారులు, పార్టీ నాయకులు, సామాన్య ప్రజలతో ఆయన ముఖాముఖి చర్చించారు. వారి సమస్యలను సావధానంగా విని సానుకూలంగా స్పందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

April 4, 2026 / 03:20 PM IST

‘టీటీడీ పవిత్రతను కాపాడే చర్యలు తీసుకోవాలి’

PPM: టీటీడీ పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. శనివారం కురుపాం మండలంలో స్థానిక కస్పగదవలస శ్రీ వేంకటేశ్వర ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ఛైర్మన్‌ బీ.ఆర్‌. నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు.

April 4, 2026 / 03:15 PM IST

టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్

ASR: టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును తక్షణమే రాజీనామా చేయించాలని అరకు MLA రేగం మత్స్యలింగం డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం అరకులోయ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగలక్ష్మీ, వైసీపీ శ్రేణులతో పూజలు చేశారు. తిరుమల పవిత్రతను పాడుచేస్తున్న బీఆర్ నాయుడు గురించి వైసీపీ చెబుతున్నా సీఎం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

April 4, 2026 / 03:15 PM IST

సాగర్ జలాలు నిలిచిపోవడంతో రైతుల ఆందోళన

ప్రకాశం: ముండ్లమూరు మండలం పరిధిలోని రాజానగరం మేజర్ నుంచి సింగనపాలెం మైనర్ వరకు సాగర్ జలాలు పూర్తిగా నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట పైరుకంకి, పొట్ట దశలో ఉండగా ఈ సమయంలో నీరు అత్యవసరం అంటున్నారు. రెండు రోజులుగా నీరు రాకపోవడంతో ఎకరాకు రూ.30-40 వేల పెట్టుబడి ప్రమాదంలో పడిందని వాపోతున్నారు.

April 4, 2026 / 03:04 PM IST