VSP: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంపై జివిఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కఠిన చర్యలు చేపట్టారు. ఉత్తర జోన్ వార్డు నెం. 25లో తనిఖీల సందర్భంగా రహదారులపై నిర్మాణ వ్యర్థాలను పడేసిన భవన యజమానికి రూ. 25,000 జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశంలో చెత్త పారబోసిన ఒక వ్యాపార సంస్థను సీజ్ చేశారు. పారిశుధ్య విషయంలో అలక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
SKLM: స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 19వ వర్ధంతి సందర్భంగా సోంపేటలోని సర్దార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రివర్యులు, ఆయన కుమారుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ , గౌతు విజయమ్మతో కలిసి పుష్పాంజలి ఘటించి తండ్రి సేవలను స్మరించుకున్నారు.
కోనసీమ: బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా అమలాపురంకు చెందిన కొండేటి జయలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆయన నివాసంలో ఆదివారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మహిళా మోర్చా మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని నల్లా పవన్ ఆమెకు సూచించారు.
ATP: గుత్తి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో రిల్స్ తీస్తే చర్యలు తప్పవని సీఐ రామారావు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది యువత సామాజిక మధ్యమాలలో ఫేమ్ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల గురించి సెల్‌ఫొన్‌లో రీల్స్ చిత్రీకరిస్తూ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించేందుకు సహాయం పొందేందుకు ప్రాధాన్యం పొందిన స్థలం పోలీస్ స్టేషన్ అన్నారు.
E.G: కడియం మండలం వీరవరం గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసైనికులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ఇటీవల ఆరోగ్య సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి రావాలని పార్థించారు.
VZM: ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్‌బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.
NTR: విజయవాడ వాంబే కాలనీ ఎంపీ లాడ్స్ నిధులు రూ.75 లక్షలతో నిర్మించనన్ను కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: గుత్తి శివారులోని చెరువు కట్ట వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన టూ వీలర్‌తో నిలబడి ఉన్న హరిజన రాము అనే వ్యక్తిపై వెనుక వైపు నుంచి లారీ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాముకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
NLR: జర్నలిస్టులకు ఈ నెల 24, 25న నెల్లూరు జీజీహెచ్ ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ వివరాలతో మంగళవారం ఉదయం 10 గంటల లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. షుగర్, రక్త, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల కోసం ఖాళీ కడుపుతో రావాలని, గత వైద్య పరీక్షల రిపోర్టులు తీసుకురావాలని సూచించారు.
E.G: పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలోని ఎమ్మెల్సీ కార్యాలయం వద్ద సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజల వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందజేసినట్లు ఆయన వెల్లడించారు.
CTR: పులిచెర్ల మండలం కొత్తపేట వద్ద ఆదివారం ఉదయం కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందింది. కొత్తపేట-మంగళపేట మార్గమధ్యంలోని సబ్ స్టేషన్ సమీపంలో జింక మృతి చెంది ఉండటాన్ని స్థానికలు గుర్తించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
VZM: బొబ్బిలి కళింగ వైశ్యభవనంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఆదివారం ప్రారంభించారు. ఈనెల 22వ తేదీన బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో బుడా ఛైర్మన్ తెంటు లక్ష్మునాయుడు పాల్గొన్నారు.
TPT: తిరుపతి కలెక్టరేట్లో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 నుంచి 2 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజలు అర్జీలతో హాజరుకావాలని సూచించారు. 1100 నంబర్ లేదా Meekosam.ap.gov.in ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.
సత్యసాయి: ముదిగుబ్బ మండలం బూడనంపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ తన నిరాడంబరతను చాటుకున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన అనంతరం, అక్కడ శ్రమిస్తున్న రైతు కూలీలతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. హోదాను పక్కన పెట్టి సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోయి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.
ATP: శ్రీరామరెడ్డి తాగునీటి పథక కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరారు. కలెక్టర్ ఆనంద్ చొరవతో కార్మికుల ఖాతాల్లోకి 2 నెలల జీతాలు జమ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీతాల చెల్లింపుపై కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్‌కు కార్మికులు కృతజతలు తెలిపారు.