• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బీఆర్ నాయుడును వెంటనే తొలగించాలి’

GNTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలని ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. నల్లపాడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన నాయుడును సీఎం చంద్రబాబు కాపాడటం దారుణమన్నారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

April 4, 2026 / 04:00 PM IST

తడికలపూడి ఎస్సైగా వల్లి పద్మ బాధ్యతలు

ELR: కామవరపుకోట మండలం తడుకలపూడి ఎస్సై‌గా ఇవాళ వల్లి పద్మ బాధ్యతలు చేపట్టారు. గతంలో పని చేసిన SI చెన్నారావు ఇటీవల వీఆర్‌కి బదిలీ ఆయన సంగతి తెలిసిందే. స్టేషన్ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. మండల పరిధిలోని అసాంఘిక కార్యక్రమాల నిరోధానికై కృషి చేస్తానని తెలిపారు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

April 4, 2026 / 04:00 PM IST

గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

SKLM: పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యా వాతావరణం, విద్యార్థుల వసతి సదుపాయాలు, భోజన ఏర్పాట్లు వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

April 4, 2026 / 03:55 PM IST

చెన్నేకొత్తపల్లిలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్

సత్యసాయి: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు సమర్పించారు. బాధితుల విన్నపాలను సావధానంగా విన్న ఆమె, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.

April 4, 2026 / 03:50 PM IST

బీసీల హక్కుల సాధన కోసం ఆమరణ దీక్ష

E.G: భారత చైతన్య యువజన (బీసీ వై) పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఇంటింటికి బీసీ చైతన్యం కార్యక్రమం నిర్వహించారు. బీసీల హక్కుల సాధన కోసం పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11న మంగళగిరిలో ఆమరణ దీక్ష చేపడుతున్నారని వారు వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నామని తెలిపారు.

April 4, 2026 / 03:50 PM IST

మార్కెట్ యార్డ్‌లో ఉచిత భోజన సౌకర్యం

ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌కు వచ్చే రైతులు, వ్యాపారుల కోసం ఉచిత భోజన కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి ఈ నూతన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక నుంచి ప్రతి శనివారం, ఆదివారం యార్డ్ ప్రాంగణంలో ఉచిత భోజనం లభిస్తుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

April 4, 2026 / 03:45 PM IST

గుమ్మలక్ష్మీపురంలో కార్డన్ సెర్చ్

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని పిల్లిగూడ, మాసాడగూడ గ్రామాల్లో పోలీసులు “ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. 240 మంది, 54 వాహనాలు తనిఖీ చేసి, 5 వాహనాలు సీజ్ చేశారు. 350 లీటర్ల నాటు సారా తయారీ ఊటను ధ్వంసం చేసి, అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 4, 2026 / 03:42 PM IST

‘బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి’

KRNL: కోసిగిలో ఆర్టీసీ బస్సు కిందపడి విద్యార్థి మృతి చెందడంపై ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడు కంపాటి నరసింహులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్రేషియాతో పాటు ఆర్టీసీలో ఒక ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరారు.

April 4, 2026 / 03:40 PM IST

ఘనంగా జాతీయ విటమిన్ సి దినోత్సవం

W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో జాతీయ విటమిన్ ‘సి’ దినోత్సవం ఇవాళ ఘనంగా జరిగింది. MLHP మేడిది అనిత మాట్లాడుతూ.. మానవులలో రోగనిరోధక శక్తిని పెంపొందించుటలో ‘సి’ విటమిన్ పాత్ర, ఉపయోగాలను, లభ్యమయ్యే వనరులను గురించి విద్యార్థులకు అవాహన కల్పించారు.హెచ్‌ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ ఆధ్వర్యంలో ‘సి’ విటమిన్ ఉండే పండ్లను పాఠశాలలో ప్రదర్శించారు.

April 4, 2026 / 03:33 PM IST

బీఆర్ నాయుడుని తొలగించాలని డిమాండ్

ప్రకాశం: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని తొలగించాలని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శిలోని పొదిలి రోడ్లో గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ ఛైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు ఉన్నారు.

April 4, 2026 / 03:30 PM IST

గుంటూరులో ఘనంగా ‘రన్ ఫర్ జీసస్’ ర్యాలీ

GNTR: గుంటూరు వెస్ట్ పారిష్ చర్చి వద్ద నుంచి ప్రారంభమైన ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ర్యాలీని ప్రారంభించి పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

April 4, 2026 / 03:30 PM IST

గాలివీడు పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య: గాలివీడు పీహెచ్‌సీని కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేసి, సిబ్బంది గైర్హాజరు, మందుల నిల్వ, పరిశుభ్రతలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశించారు. లేబర్ రూమ్‌లో అత్యవసర మందులు సక్రమంగా లేవని గుర్తించి, వెంటనే అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలు ప్రాధాన్యమని తెలిపారు.

April 4, 2026 / 03:30 PM IST

TTD ఛైర్మన్ను తొలగించాలని డిమాండ్

CTR: పూతలపట్టు నియోజకవర్గంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. పాలేరు హైవే సాయిబాబా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

April 4, 2026 / 03:26 PM IST

‘పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి’

SKLM: పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త వెంకన్న చౌదరి మందస మండలంలోని పలు పంచాయతీలలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా పంచాయతీలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గూర్చి చర్చించారు. రానున్న పంచాయితీ ఎన్నికలకు ఐకమత్యంగా పనిచేస్తూ ఎన్నికలకు సమాయత్తం కావాలని కోరారు. పంచాయతీలలో ఉన్న సమస్యలను గ్రామ అధ్యక్ష, కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు.

April 4, 2026 / 03:25 PM IST

ఎమ్మెల్సీ గోవిందరెడ్డికి పోలీసుల నోటీసులు

KDP: బద్వేల్ టౌన్‌లో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తొలగింపునకు డిమాండ్ చేస్తూ వైసీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని పోరుమామిళ్ల పోలీసులు ఎమ్మెల్సీ గోవిందరెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. శాంతియుతంగా ప్రజాస్వామ్య పరిరక్షణ దృక్పథంతో జరుగుతుందని ఆయన ప్రకటించారు.

April 4, 2026 / 03:21 PM IST