• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గేమింగ్ జోన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోట్ల

NDL: డోన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో మైకేల్ స్విమ్మింగ్ పూల్, గేమింగ్ జోన్‌ను శనివారం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

April 11, 2026 / 05:00 PM IST

శ్రీకాకుళంలో అఖిలభారత కిసాన్ కాంగ్రెస్ దినోత్సవం

శ్రీకాకుళం ఇందిరా విజ్ఞాన్ భవన్‌లో అఖిలభారత 90వ కిసాన్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి మాట్లాడుతూ.. రైతు కార్పొరేటు వ్యవస్థ ప్రస్తుత ప్రభుత్వాల చేతుల మధ్య నలిగిపోతూ వ్యవసాయాన్ని చేస్తున్న రైతులను ఆత్మహత్యల స్థితికి తీసుకెళ్తున్నారన్నారు.

April 11, 2026 / 04:46 PM IST

ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

KRNL: పెద్దకడబూరు మండలం హనుమాపురం సమీపంలో 167 జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. SML డిగ్రీ కళాశాల ముందు, హనుమాపురం గ్రామ సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమలో ఏఎస్ఐ శివరాములు, టీడీపీ నేత బీపీ ఈరన్న పాల్గొన్నారు.

April 11, 2026 / 04:45 PM IST

రేపు చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు

ATP: జిల్లాస్థాయి అండర్-19 చెస్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం స్థానిక కోవూరు నగర్‌లోని విద్యారణ్య పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెస్ అసోసియేషన్ నాగరాజు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు 18,19 తేదీలలో అన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రితో హాజరు కావాలన్నారు.

April 11, 2026 / 04:40 PM IST

‘గ్రామ సభకు విశేష స్పందన’

BPT: పంగులూరు మండల పరిధిలోని రామకూరులో ఇవాళ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు విశేష స్పందన లభించింది. భూ రికార్డుల ప్రక్షాళన, క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఆదేశించిన ‘రెవెన్యూ సదస్సు’లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచే రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను అధికారులు చెప్పారు.

April 11, 2026 / 04:40 PM IST

కుంటుంబ సభ్యులకు కీర్తన మృతదేహం అప్పగింత

KDP: ఖాజీపేట అగ్రహారానికి చెందిన విద్యార్థిని కీర్తన మృతదేహానికి శనివారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కావడంతో వైద్యులు మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణం అంతా విషాద వాతావరణంతో నిండిపోయింది.

April 11, 2026 / 04:40 PM IST

UPDATE: ఆదోని రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలు

KRNL: ఆదోని శివారులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిప్రా అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై వివరాల మేరకు.. బెంగళూరు నగరానికి చెందిన ప్రదీప్, అర్పిత, షర్మిల, సిప్రా రాయచూరులో జరిగే వివాహానికి బయలుదేరారు. ఆదోని శివారులో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 3 తీవ్రంగా గాయపడ్డారు.

April 11, 2026 / 04:35 PM IST

తుమ్మికాపల్లిలో పోషణ పక్వాడ కార్యక్రమం

VZM: గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామంలోని అంగన్వాడీ-1 కేంద్రంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ సీడీపీవో ఎం.రాజేశ్వరి ఆదేశాల మేరకు సూపర్‌వైజర్ టి.జానకి పర్యవేక్షణలో అంగన్వాడీ కార్యకర్తలు సుభాషిణి జయలక్ష్మి, సుజాత, చంద్రావతి, జానకి, జయ కలిసి గర్భిణీలు, బాలింతలకు పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు.

April 11, 2026 / 04:35 PM IST

టోల్ ప్లాజా వద్ద కారుపై పడ్డ ట్యాంకర్

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌గేట్ వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ ట్యాంకర్ ఓ కారుపై పడిన ఘటన కలకలం రేపింది. ప్రమాద సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే వారి పరిస్థితిపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 11, 2026 / 04:30 PM IST

కాశీశ్వరి అంత్యక్రియలకు యూత్ సభ్యులు నగదు అందజేత

NDL: మహానంది గ్రామ సమీపంలోని అయ్యన్నగర్ గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన కాశీశ్వరి అంత్యక్రియలకు గాను భగత్ సింగ్ యూత్ సభ్యులు రూ.18 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. శనివారం కాశీశ్వరి అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేద కుటుంబమైన వారిని ఆదుకునేందుకు యూత్ సభ్యులు మహేష్, చంద్ర, శివలు చందాల రూపంలో రూ.18 వేలు ప్రోగు చేసి అంత్యక్రియలకు అందజేశారు.

April 11, 2026 / 04:30 PM IST

టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

సత్యసాయి: కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పదవ తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సందర్శించారు. కేంద్రంలో ఉపాధ్యాయులకు కల్పించిన వసతులపై విద్యాశాఖ అధికారి కృష్ణప్పను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల మేరకు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

April 11, 2026 / 04:29 PM IST

గ్రామస్థులపై దాడిని ఖండించిన వైసీపీ నేతలు

కృష్ణా: గుడివాడ మండలం రామన్నపూడి గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులపై జరిగిన దాడిని వైసీపీ నేతలు శనివారం తీవ్రంగా ఖండించారు. గ్రామంలో అక్రమ మట్టి తవ్వకాలు జరపడమే కాకుండా, వాటిని ప్రశ్నించిన స్థానికులపై దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

April 11, 2026 / 04:26 PM IST

సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలి: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అన్ని గ్రామాలు, మండలాల్లో ఘనంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.

April 11, 2026 / 04:20 PM IST

‘టీడీపీ హయాంలోనే జువ్వలదిన్నెకు అంకురార్పణ’

NLR: టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రత్యేక కృషితోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం సాధ్యమైందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణపట్నం నుంచి ఓడరేవు మధ్య హార్బర్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న పాత జీవోలను రద్దు చేయించి, కేంద్రంతో సంప్రదింపులు జరిపి రూ.288.80 కోట్ల నిధులు మంజూరు చేయించామని ఆయన వివరించారు.

April 11, 2026 / 04:20 PM IST

‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు’

E.G: ద్వారకతిరుమల మండలం తిమ్మాపురంలో గోపాలపురం MLA మద్దిపాటి వెంకటరాజు గుప్తా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో శనివారం దివ్యాంగులకు ఉచిత క్యాలిపర్స్ & కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఇలాంటి సేవలు అందించే ఆసుపత్రి నియోజకవర్గంలో ఉండటం గర్వకారణమని ఆయన తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

April 11, 2026 / 04:20 PM IST