• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సబ్ జైలును సందర్శించిన కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి

NTR: నందిగామలోకృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ గోపి, న్యాయ సేవాధికారి రామకృష్ణ కోర్టు ప్రాంగణం, సబ్ జైలు పర్యటించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, కార్యదర్శి చెరుకుమల్లి రామారావు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. బార్ ఛాంబర్‌లో సమస్యలు వివరించగా పరిష్కరిస్తానని జడ్జి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

April 4, 2026 / 09:00 PM IST

పేరూరు-అవిలాల ఛానల్ పనులు వేగవంతం

TPT: పేరూరు చెరువు నుంచి అవిలాల చెరువు వరకు సప్లై ఛానల్‌కు సంబంధించిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పనులకు రూ. 8 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచి, అవిలాల చెరువు సుందరీకరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు సూచించారు.

April 4, 2026 / 08:55 PM IST

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి

SKLM: సింగుపురంలో బాదం పాలు తాగి 80 అస్వస్థతకు గురైన ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ స్పందించారు. శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు అందుతున్న వైద్యం గురించి మంత్రి ఆరాతీశారు. బాధితులు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

April 4, 2026 / 08:45 PM IST

మత్తు లేకుండా గుండె బైపాస్ సర్జరీ

GNTR: రమేష్ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల రోగికి మత్తు ఇవ్వకుండా మెలకువలోనే గుండె బైపాస్ ఆపరేషన్ చేశారు. గతంలో క్యాన్సర్ చికిత్సల వల్ల సదరు రోగి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. సాధారణ మత్తు ఇస్తే ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు భావించారు. దీంతో డాక్టర్ల బృందం వెంటిలేటర్ అవసరం లేకుండానే ఈ సర్జరీని పూర్తి చేశారు.

April 4, 2026 / 08:32 PM IST

మృతుని కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం

ప్రకాశం: ఇటీవల మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వెలిగండ్ల మండలం చోడవరం గ్రామానికి చెందిన పొదిలి మహేంద్ర కుటుంబాన్ని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని మహేంద్ర భార్య నాగమణికి అందజేశారు.

April 4, 2026 / 08:30 PM IST

డోన్ మండలంలో రోడ్డు ప్రమాదం

NDL: డోన్ మండలం చిన్న మల్కాపురం సమీపంలో ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి నిర్మాణ పనుల కోసం వేసిన కంకర కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు కంకరపై వాహనం జారి కిందపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు గుర్తించి వెంటనే డోన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

April 4, 2026 / 08:30 PM IST

టి.నరసాపురం ఎస్సై కీలక సూచనలు

ELR: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, టి.నర్సాపురం ఎస్సై జయబాబు విగ్రహ కమిటీ సభ్యులకు, యువతకు పలు కీలక సూచనలు చేశారు. మహనీయుని జయంతి వేడుకలను అత్యంత క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో మరియు ఘనంగా నిర్వహించు కోవాలని కోరారు. ప్రతి విగ్రహం వద్ద తప్పనిసరిగా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.

April 4, 2026 / 08:30 PM IST

ప్రజాహిత బడ్జెట్‌పై అవగాహన కార్యక్రమం

KRNL: కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని RDO కార్యాలయంలో నిర్వహించిన ఏపీ బడ్జెట్ 2026-27 ఔట్రీచ్ కార్యక్రమంలో MLA దస్తగిరి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులు, మహిళలు, యువత అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిందని తెలిపారు. మొత్తం రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్‌లో కోడుమూరు నియోజకవర్గానికి రూ.362 కోట్లు కేటాయించారని తెలిపారు.

April 4, 2026 / 08:30 PM IST

ప్రైవేటు టీచర్లకు 12 నెలల వేతనం ఇవ్వాలి: DYFI

KDP: జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 12 నెలల పూర్తి వేతనం చెల్లించాలని DYFI జిల్లా కార్యదర్శి శివ డిమాండ్ చేశారు. యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి 12 నెలల ఫీజులు వసూలు చేస్తూ, టీచర్లకు మాత్రం 10 నెలల జీతం మాత్రమే ఇవ్వడం అన్యాయమని విమర్శించారు. వేసవిలో జీతం లేక టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

April 4, 2026 / 08:30 PM IST

భీమవరం డీఎస్పీ హెచ్చరిక

W.G: ఆకివీడులో ఎటువంటి ఆందోళనలకు అనుమతి లేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆకివీడులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన కోరారు.

April 4, 2026 / 08:21 PM IST

నెల్లూరు వైద్యురాలికి పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణం

NLR: నెల్లూరుకు చెందిన ప్రముఖ వైద్యురాలు అంబటి హేమలత రెడ్డి పవర్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. విజయనగరం జిల్లా రాజాంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 63 కేజీల మాస్టర్స్ కేటగిరీలో ఆమె విజయం అందుకున్నారు. హేమలత రెడ్డి ప్రస్తుతం న్యూరో వైద్యురాలిగా నిర్వహిస్తుండగా.. ఆమె భర్త పీహెచ్సీ వైద్యాధికారిగా పనిచేస్తున్నారు.

April 4, 2026 / 08:20 PM IST

గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్

VZM: ఒడిశా నుంచి విశాఖకు గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు SP దామోదర్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, ఈ కేసులో మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.

April 4, 2026 / 08:20 PM IST

హత్య కేసు ఛేదించిన పోలీసులు.. భార్య, ప్రియుడు అరెస్ట్

CTR: కుప్పంలో పోలీసులు హత్య కేసు ఛేదించారు. భార్య, ప్రియుడిని అరెస్ట్ చేశారు. మోట్లచెరువు గ్రామానికి చెందిన భూపతి (38) మార్చి 24న బిక్కలగట్టు సమీపంలోని మామిడి తోటలో ఉరివేసుకున్న స్థితిలో మృతిగా కనిపించాడు. పోలీసుల దర్యాప్తులో భూపతి భార్యతో పాటు ఆమె ప్రియుడు కలిసి హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచారు.

April 4, 2026 / 08:19 PM IST

చిత్తూరులో రేపు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

CTR: జగ్జీవన్ రామ్ 119వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ భాష శనివారం తెలిపారు. నగరంలోని గంగినేని చెరువు కట్ట వద్దగల జగ్జీవన్ రామ్ విగ్రహాం వద్ద నివాళులర్పించిన అనంతరం బీ. ఆర్. అంబేద్కర్ భవనము వరకు, చిత్ర పటములతో ర్యాలీ ఉంటుందని చెప్పారు. ప్రజాప్రతినిధుల అధికారులు హాజరుకావాలని కోరారు.

April 4, 2026 / 08:17 PM IST

జిల్లాలో కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ పర్యటన

VSP: కేంద్ర సమాచార కమిషనర్(సీఐసీ) సధారాణి రేలంగి ఈ నెల 6, 7 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆరో తేదీన ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. అనంతరం ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

April 4, 2026 / 08:10 PM IST