• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జన గణనలో ప్రజలు వాస్తవ సమాచారం అందించాలి: కలెక్టర్

CTR: జన గణనలో ప్రజలు వాస్తవ సమాచారం అందించి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జన గణనలో భాగంగా ముందుగా చేపట్టే గృహ గణనలో స్వీయ నమోదు గురించి కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర, దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి వివరాలు ఎంతో కీలకం అని తెలిపారు.

April 17, 2026 / 01:10 PM IST

‘భవణ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి’

SKLM: కొత్తూరు మండలం సిరుసువాడ గ్రామంలో సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని అన్నారు. భవణ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని CITU కన్వీనర్ పనస రమేశ్ డిమాండ్ చేశారు. 

April 17, 2026 / 01:10 PM IST

‘మహిళా రిజర్వేషన్ బిల్లుకు YCP సంపూర్ణ మద్దతు’

KRNL: మహిళా రిజర్వేషన్ బిల్లుకు YCP సంపూర్ణ మద్దతిస్తోందని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి అన్నారు. శుక్రవారం కర్నూలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ రేణుకతో కలిసి మీడియాతో ఆమె మాట్లాడారు. మహిళలకు పెద్దపీట వేసి అవకాశాలు కల్పించిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.

April 17, 2026 / 01:09 PM IST

జనగణన సర్వేపై ముమ్మరంగా శిక్షణ

పల్నాడు: పెదకూరపాడు జడ్పీ హైస్కూల్‌లో శుక్రవారం జనగణన సర్వేపై రెండోరోజు శిక్షణ తరగతులు జరిగాయి. ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లకు సాంబశివరావు, నేహమతుల్లా ఫీల్డ్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ వరలక్ష్మి పర్యవేక్షించారు. గ్రామాల్లో చేపట్టే సర్వేకు ప్రజలంతా అధికారులకు సహకరించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.

April 17, 2026 / 01:04 PM IST

సిరిమానోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన కమీషనర్

VZM: బొబ్బిలి మున్సిపల్‌ కమిషనర్‌ ఎల్.రామలక్ష్మి శుక్రవారం పాత బొబ్బిలిలో జరగనున్న శ్రీ సరే పోలమాంబ సిరిమానోత్సవానికి సంబంధించి ఎర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రథం తిరిగే మార్గాలను తనిఖీ వేసి, డ్రైన్ల పూడికతీత, రథం దారి ఆక్రమణలు తొలగించడం, గుంతలు పూడ్పడం వంటి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

April 17, 2026 / 01:04 PM IST

రాయచోటిలో ఫైర్ డెమో కార్యక్రమం

అన్నమయ్య: అగ్నిమాపక వారోత్సవాలలో 4వ రోజు సందర్భంగా రాయచోటిలోని ఓ పాఠశాలలో ఫైర్ డెమో కార్యక్రమం నిర్వహించారు. రాయచోటి ఫైర్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి, సిబ్బంది విద్యార్థులకు రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వివిధ రకాల విపత్తులు సంభవించినప్పుడు భయపడకుండా సమయోచిత విధానంపై ప్రాక్టికల్‌గా డెమో ఇచ్చారు.

April 17, 2026 / 01:01 PM IST

నిర్మాణ కార్మికుల పథకాల పునరుద్ధరణ: కలెక్టర్

KKD: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020లో నిలిపి వేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను మార్చి 1, 2026 నుండి పునరుద్ధరించినట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. వివాహ కానుక రూ.20,000, ప్రసూతి సహాయం రూ.20,000, సహజ మరణంపై రూ. 60,000, దహన సంస్కారాలకు రూ.20,000 అందించనున్నారు. వివరాలకు 9492555112కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు.

April 17, 2026 / 01:00 PM IST

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

కోనసీమ: భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ మహేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కార్మికులందరూ తప్పని సరిగా తమ పేర్లను నమోదు చేసుకుని, ఆర్థిక ప్రయోజనాలను పొందాలన్నారు. వయో పరిమితి 18 నుండి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు పథకానికి అర్హులన్నారు. ​నమోదు రుసుము క్రింద రూ. 50 చెల్లించాలన్నారు.

April 17, 2026 / 12:52 PM IST

జగన్ మతి చలించి మాట్లాడుతున్నారు: మంత్రి

NDL: YCP పేరు ఇప్పుడు గొడ్డలి పార్టీ అని ఇవాళ మంత్రి BC జనార్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ YCP సహా నేతలు ఏది మాట్లాడినా ‘నరుకుతాం, చంపుతాం, అధికారంలోకి వస్తే పరిశ్రమల అంతు తేలుస్తాం’ అంటూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ మతి చలించి మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడతారా? అని నిలదీశారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని ఓర్వలేకపోతున్నారన్నారు.

April 17, 2026 / 12:50 PM IST

మహిళా రిజర్వేషన్లపై జిల్లాలో విస్తృత చర్చ

ATP: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు దిశగా అడుగులు పడుతుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అనంతపురం జిల్లాలో నాలుగు, శ్రీ సత్యసాయి జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 33 శాతం కోటా ప్రకారం ఈ మార్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

April 17, 2026 / 12:47 PM IST

‘ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి’

VZM: ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల వెండార్ డెవలప్మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పాల్గొన్నారు.

April 17, 2026 / 12:45 PM IST

పెద్దసరియాపల్లి గ్రామంలో ఉచిత వైద్య పరీక్షలు

SKLM: పాతపట్నం మండలం పెద్దసరియాపల్లి గ్రామంలో ఉన్న అంగన్ వాడిలో శుక్రవారం ఉచిత హోమియో వైద్యశిబిరం నిర్వహించారు. తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల వైద్యాధికారినీ డాక్టర్ ఎస్. ఉమాగౌరీ చిన్న పిల్లలకు, బాలింతలకు, సాధారణ నొప్పులకు తనిఖీలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెంబూరు ప్రభుత్వ హోమియో వైద్యశాల ఫార్మసిస్ట్ దివ్య రెడ్డి ఉన్నారు.

April 17, 2026 / 12:42 PM IST

‘డీ లిమిటేషన్‌కు మద్దతిస్తే ఆంధ్ర ద్రోహులే’

E.G: డీ లిమిటేషన్‌కు మద్దతు ఇచ్చిన వారు ఆంధ్ర ద్రోహులు అని ఏపీ ప్రత్యక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం రాజమండ్రిలో మీడియాతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల కోసం బీజేపీ పెద్ద కుట్ర వేసిందన్నారు. ఈ బిల్ పాస్ అయితే దేశంలో విభజన రావచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

April 17, 2026 / 12:42 PM IST

కమలాపురంలో వైభవంగా ఎల్లమ్మ తల్లి జాతర

KDP: కమలాపురంలోని పెద్ద చెప్పలిలో వెలసిన ఎల్లమ్మ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక అమ్మవారు పులి వాహనంపై గ్రామ వీధుల్లో విహరించారు. అంతకు ముందు అమ్మవారిని ఆలయ అర్చకులు అత్యంత శోభాయమానంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

April 17, 2026 / 12:37 PM IST

‘జలధార’పై అధికారులకు అవగాహన కల్పించిన కలెక్టర్

NDL: కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన 100 రోజుల ‘జలధార’ కార్యక్రమ వర్క్‌షాప్‌లో ఇవాళ కలెక్టర్ రాజకుమారి అధికారులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాల పెంపు, నీటి వనరుల సమర్థ వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యల నివారణ లక్ష్యాలుగా పని చేయాలని సూచించారు. కార్యక్రమ అమలు విధానం, ప్రణాళికలు, సాంకేతిక వినియోగంపై వివరించి దిశానిర్దేశం చేశారు.

April 17, 2026 / 12:35 PM IST