GNTR: వట్టిచెరుకూరు మండలంలో జేసీ అశుతోష్ శ్రీవాస్తవ శనివారం పర్యటించారు. వట్టిచెరుకూరు మండలంలో సర్వే నెం.241లో చెరువుతో పాటు అక్కడ ఉన్న నివాస స్థలాలు కూడా పోరంబోకుగా నమోదై ఉండటం, దానిని గ్రామ కంఠంగా మార్పులు చేయాలని కోరుతూ ప్రజలు కోరడం జరిగింది. ఈ మేరకు వాస్తవ పరిస్థితులను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులను త్వరితగతిన వారి నివేదికను సమర్పించాలని కోరారు.
CTR: పెద్ద పంజాణిలో జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమం, ఈ-ఆటోల ప్రారంభోత్సవంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురిచేశారని ఆరోపించారు. రాజధాని అంశంపై స్పష్టత లేకుండా గంటకో మాట మార్చుతున్నారని విమర్శించారు.
VZM: మిషన్ హార్టి విజన్‌లో భాగంగా జిల్లాలో రెండో విడతలో 7260 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు జూన్ నాటికి భూములను సిద్ధం చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 275 బ్లాక్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ELR: పాపుల రక్షణ కోసం శిలువపై ప్రాణత్యాగం చేసి త్యాగానికి మారుపేరుగా నిలిచిన క్రీస్తు మహిమను ఘనపరిచేందుకు ఆయన చూపిన బాటలో పయనించాలని ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్భోదించారు. శనివారం ఏలూరులో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతియుత జీవనాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు.
ELR: నూజివీడు పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్లో శనివారం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ నవీన లావణ్య లత మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజీవన్ రామ్ చేసిన కృషి ఎనలేనిది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ షేక్ అన్వర్ భాష, టి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
NDL: బేతంచెర్లలో స్టేట్ బ్యాంక్ సమీపంలో సిమెంట్ ట్రక్కు ఇరుక్కుపోవడంతో తాగునీటి పైపులైన్ పగిలి నీరు వృథాగా పోతోందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ టీ తాగేందుకు ట్రక్కును పక్కకు నిలపగా, టైర్లు భూమిలోకి కుంగి లోపల ఉన్న పైపు దెబ్బతిసిందన్నారు. దీంతో భారీగా నీరు బయటకు వస్తోందని వెల్లడించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు ఇవాళ మున్సిపల్ అధికారులను కోరారు.
E.G: రాజమండ్రి తాడితోటలో శ్రీరామనవమి అన్నసంతర్పణ కార్యక్రమంలోవైసీపీ మాజీ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, మాజీ రుడా ఛైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి శనివారం పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించి భక్తిని చాటుకున్నారు. రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ 32వ వార్డు ఇంఛార్జ్ బూడిద శరత్ కుమార్, కాటం సంజయ్ పాల్గొన్నారు.
ASR: ప్రజలు మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. శనివారం అనంతగిరి మండలం, శివలింగపురం గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. గ్రామంలో అనంతగిరి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 14 వాహనాలను సీజ్ చేశామన్నారు. గంజాయి సాగు, వినియోగం, రవాణా నేరమని డీఎస్పీ అన్నారు.
GNTR: అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి P. నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు. అమరావతిలో రూ.57,821 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
VSP: వ్యాధుల నియంత్రణకు ప్రతీ ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ సూచించారు. శనివారం సీతమ్మధారలో లయన్స్ క్యాన్సర్ ఆస్పత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఈ టీకా కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు లయన్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
KDP: సింహాద్రిపురం నూతన తహసీల్దార్‌గా బి. అనురాధ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె డీఎం సివిల్ సప్లై విభాగంలో విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై తాజా బదిలీలలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో ‘గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ను పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ వలవల బాబ్జీ శనివారం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు, స్వీకరించారు. సమస్య పరిష్కారించాలని అధికారులతో మాట్లాదారు. రూ.5.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందచేశారు.
అమరావతి రాజధానిగా కొనసాగేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని కర్నూలు జిల్లా అధ్యక్షుడు క్రాంతి నాయుడు తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతితో పాటు రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. మూడు రాజధానుల పేరుతో గతంలో కాలయాపన జరిగిందని, ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు.
ప్రకాశం: కొరిసిపాడు మండలం మేదరమెట్ల టౌన్లోనే సెయింట్ ఆర్నాల్డ్ స్కూల్ ఎదురుగా ఉన్న స్క్రాప్ నిల్వ ఉంచిన షాపులో శనివారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించి అద్దంకి నుంచి ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఎలాంటి ప్రాణ అపాయం జరగలేదు. మంటలను పైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు.
NDL: బనగానపల్లె ఎమ్మెల్యే, రోడ్ల భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇవాళ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు మంత్రికి వినతి పత్రాలను అందజేశారు.