• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై పోలీసులు దాడి.!

ప్రకాశం: కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో పొగాకు గూడెం నందు పేకాట ఆడుతున్న 9 మందిని ఎస్సై శివ నాగరాజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 9,330 స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై శివ నాగరాజు హెచ్చరించారు. మత్తుపదార్థాలకు, పేకాటకు యువత దూరంగా ఉండాలని సూచించారు.

April 17, 2026 / 08:27 PM IST

హజ్ యాత్రికుల సదుపాయాలను తెలుసుకున్న ఎస్పీ

కృష్ణా: గన్నవరం ఎస్ఎం కళ్యాణ మండపంలో హజ్ యాత్రికులకు అందుతున్న సదుపాయాల గురించి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హజ్ కమిటీ సభ్యులను శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్వహిస్తున్న హజ్ యాత్రలో భాగంగా యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

April 17, 2026 / 08:26 PM IST

జనగణన పేరుతో మోసాలకు అప్రమత్తం

CTR: భారత జనగణన-2027లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు స్వయం గణన, మే 1 నుంచి 30 వరకు ఇంటింటి గణన జరుగుతుందని జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. జనగణన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు అడగరని స్పష్టం చేస్తూ, అలాంటి వివరాలు కోరితే ఇవ్వవద్దని ప్రజలకు హెచ్చరించారు.

April 17, 2026 / 08:21 PM IST

అనంతపురం జిల్లా పరిషత్ సీఈవోగా విజయలక్ష్మి

ATP: గుంతకల్లు DLDOగా పనిచేస్తున్న పి.విజయలక్ష్మి పదోన్నతి పొంది, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO)గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారని జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు.

April 17, 2026 / 08:20 PM IST

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు: మంత్రి

సత్యసాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాల తీరును మంత్రి సత్యకుమార్ యాదవ్ ‘ప్రజాస్వామ్యానికి చీకటి రోజు’గా అభివర్ణించారు. మహిళల హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ కూటమి, బిల్లు విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దేశ మహిళలకు జరిగిన ఈ ద్రోహాన్ని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

April 17, 2026 / 08:20 PM IST

పారామెడిక్స్ సేవలు ఎంతో కీలకం

SKLM: పాతపట్నంలో నిర్వహించిన కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్య సేవలందించడంలో పారామెడిక్స్ పాత్ర కీలకం అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించడంలో పారామెడిక్స్ సేవలు ఎంతో అవసరమని తెలిపారు.

April 17, 2026 / 08:11 PM IST

‘ఓటర్ల మార్పులు చేర్పులకు సహకరించండి’

AKP: నర్సీపట్నంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో తహసీల్దార్ లోకవరపు రామారావు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీ నాయకుల సహకరించాలని సూచించారు. ఓట్లు చేర్పులు, తొలగింపు తదితరు వాటిపై పార్టీ నాయకులు పరిశీలించుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉంటుందని తెలిపారు.

April 17, 2026 / 08:06 PM IST

‘అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కోట దిబ్బలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాటి నుంచి బయట పడేందుకు చేపట్టవలసిన చర్యలను వారికి వివరించారు. ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు.

April 17, 2026 / 08:00 PM IST

‘ఎండలో పాఠశాలలు నడపడం ప్రమాదకరం’

KRNL: జిల్లాలో 43 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్న తీవ్ర ఎండల మధ్య పాఠశాలలు నిర్వహించడం విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదకరమని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర బాబు అన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు గోవర్ధన్, పుల్లయ్య, దశరథ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

April 17, 2026 / 08:00 PM IST

రిజర్వాయర్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ATP: గుంతకల్లు శివారులోని రిజర్వాయర్ వద్ద శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ వద్ద ప్రమాద హెచ్చురిక బోర్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా పిల్లలను రిజర్వాయర్ల వద్దకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. రిజర్వాయర్‌లోని మోటార్ల పనితీరును పరిశీలించారు.

April 17, 2026 / 07:50 PM IST

రిజర్వాయర్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

ATP: గుంతకల్లు శివారులోని రిజర్వాయర్ వద్ద శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. రిజర్వాయర్ వద్ద ప్రమాద హెచ్చురిక బోర్డులను ఏర్పాటు చేశారు. మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, ఆర్డీవో శ్రీనివాసులు మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా పిల్లలను రిజర్వాయర్ల వద్దకు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. రిజర్వాయర్‌లోని మోటార్ల పనితీరును పరిశీలించారు.

April 17, 2026 / 07:50 PM IST

అగ్నిప్రమాదాలపై 4వ రోజు మాక్ డ్రిల్స్

GNTR: అగ్నిమాపక వారోత్సవాలు 4వ రోజు తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని వెస్ట్‌బెర్రీ స్కూల్‌తో పాటు రవి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హైస్కూల్లో  జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్యాస్, ఎలక్ట్రికల్ ఫైర్లు, కేర్‌లెస్ స్మోకింగ్ ప్రమాదాలపై డెమోలు నిర్వహించారు. విద్యార్థులకు మాక్ డ్రిల్ ద్వారా అగ్నిప్రమాద నివారణపై అవగాహన కల్పించారు.

April 17, 2026 / 07:46 PM IST

దారికి అడ్డంగా గండి.. స్పందించిన అధికారులు

PLD: అమరావతి మండలంలోని దిడుగు గ్రామం నుంచి ఏటూరు వెళ్లే మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టారు. ఈ విషయంపై ఏప్రిల్ 14న HIT TVలో కథనం ప్రచూరితమైంది. స్పందించిన అధికారులు పంచాయతీ అధికారుల సమక్షంలో రోడ్డు మధ్యలో తీసిన గండిని పూడ్చివేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా లంక భూముల్లో గండ్లు కొడితే చర్యలు తీసుకుంటామని MPDO హెచ్చరించారు.

April 17, 2026 / 07:45 PM IST

ప్రభుత్వ బడిలో చేర్చాలని ఉపాధ్యాయుల ప్రచారం

కృష్ణా: చల్లపల్లి మండలం వక్కలగడ్డ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం నేస్తం-బడికి రా! ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పది మంది విద్యార్థులను 6వ తరగతిలో అడ్మిషన్లు ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే ఇద్దరికి 7వ, 8వ తరగతిలో అడ్మిషన్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు కందుల సుజాత, పీ.వెంకటేశ్వరరావు, హెచ్ఎం కే.ఏడుకొండలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 17, 2026 / 07:43 PM IST

ప్రభుత్వ బడిలో చేర్చాలని ఉపాధ్యాయుల ప్రచారం

కృష్ణా: చల్లపల్లి మండలం వక్కలగడ్డ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యా వారోత్సవాలలో భాగంగా శుక్రవారం నేస్తం-బడికి రా! ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పది మంది విద్యార్థులను 6వ తరగతిలో అడ్మిషన్లు ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే ఇద్దరికి 7వ, 8వ తరగతిలో అడ్మిషన్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు కందుల సుజాత, పీ.వెంకటేశ్వరరావు, హెచ్ఎం కే.ఏడుకొండలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

April 17, 2026 / 07:43 PM IST