• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేషనల్ హైవే-216పై పాల వ్యాన్ పల్టీ

కృష్ణా: జాతీయ రహదారిపై పాల వ్యాన్ ప్రమాదానికి గురైంది. సోమవారం కృష్ణా మిల్క్ యూనియన్ పాల వ్యాన్ చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు రామానగరంలో జాతీయ రహదారి-216పై పల్టీ కొట్టింది. ఉదయం నాగాయలంకలో పాల ప్యాకెట్లు సరఫరా చేసి తిరిగి మచిలీపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

April 13, 2026 / 11:20 AM IST

ప్రభుత్వ పాఠశాలలో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: ముదినేపల్లి మండలం చిగురుకోట గ్రామములో రావి శ్రీలలిత మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇవాళ కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాతలు సహకారంతో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీని నిర్వహణ కొరకు పాఠశాల సిబ్బందిలో ఒకరిని నియమించాలన్నారు.

April 13, 2026 / 11:19 AM IST

త్వరలో వందేభారత్ రైలు: కేంద్ర మంత్రి

W.G: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే ​వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తాడేపల్లిగూడెంకు మరో 15రోజుల్లో వస్తుందని కేంద్రమంత్రి భూపతిరాజు వర్మ ప్రకటించారు. సికింద్రాబాద్ డివిజన్ రైల్వే అధికారులకు కేంద్ర రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసిందని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి వీడియో షేర్ చేసినట్లు వెల్లడించారు.

April 13, 2026 / 11:15 AM IST

ఉపాధి పథకం పనులు పునఃప్రారంభం

AKP: అచ్యుతాపురం మండలం జగ్గయ్యపేటలో సోమవారం ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఏపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు పంట కాలవల మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 200 మంది వేతన దారులు పనులకు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆడారి సాంబశివరావు, ఎం. రమణబాబు పాల్గొన్నారు.

April 13, 2026 / 11:15 AM IST

‘ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన కలెక్టర్’

ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

April 13, 2026 / 11:11 AM IST

‘కొనుగోలు కేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలి’

GNTR: ఫిరంగిపురం మండలంలో మొక్కజొన్న, జొన్న, శనగ, మినుము, పెసర తదితర పంటలు కోత దశకు చేరుకున్నప్పటికీ ఇప్పటివరకు ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని రైతు సంఘాల నాయకులు తెలిపారు. సోమవారం ఫిరంగిపురంలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్‌లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు.

April 13, 2026 / 11:10 AM IST

పిచ్చుక గూడులా అల్లుకుపోయిన విద్యుత్ వైరు

పల్నాడు: పెదకూరపాడులోని స్థానిక కచేరి సెంటర్లో విద్యుత్ పోలుకు వైర్లు పిచ్చుక గూడులా అల్లుకుపోయి ఉన్నాయని స్థానిక ప్రజలు తెలిపారు. త్రీఫేస్ లైన్‌లో పదుల సంఖ్యలో విద్యుత్ వైరు ఉండడంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని వినియోగదారులు తెలిపారు. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకల వలన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ జరిగితే పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

April 13, 2026 / 11:08 AM IST

ట్రాఫిక్ అవగాహనపై సమావేశం

ఎన్టీఆర్: మహానాడు సమీపంలోని వరుణ్ మారుతి షోరూమ్‌లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇవాళ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షోరూమ్ సిబ్బందికి రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యతను వివరించిన అధికారులు, హెల్మెట్ ధరించినప్పుడు తప్పనిసరిగా క్లిప్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు.

April 13, 2026 / 11:08 AM IST

‘ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి’

E.G: ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామం నందు శ్రీ గౌరీశ్వర స్వామి వారి నూతన ఆలయ పునఃనిర్మాణానికి మంత్రి కందులు దుర్గేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

April 13, 2026 / 11:08 AM IST

ప్రొద్దుటూరులో పోలీసుల మానవతా చర్యలు

KDP: ప్రొద్దుటూరులో పోలీసులు మానవతా హృదయంతో ముందుకొచ్చారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతుల ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో, వారిని సంరక్షణలో ఉంచారు. అనంతరం జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. సీఐ నాగభూషణ్, ఎస్సై శ్రీకాంత్ చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. పిల్లలను జిల్లా అమ్మవడి శరణాలయానికి తరలించి సంరక్షణ కల్పిస్తున్నారు.

April 13, 2026 / 11:08 AM IST

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీపీ

SKLM: ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో సోమవారం సీసీ రోడ్డును ఎంపీపీ మొదలవలస చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.5 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులతో ఈ నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రతీ గ్రామం ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి దుంప చిన్నారెడ్డి ఉన్నారు.

April 13, 2026 / 11:00 AM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన ట్రైకర్ ఛైర్మన్

ELR: పోలవరంలో పారిశుద్ధ్య మెరుగుదల, సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర ట్రైకర్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ వాహనం లక్ష్యమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

April 13, 2026 / 10:55 AM IST

ఎమ్మిగనూరులో పన్నుపై రాయితీ అవకాశం

KRNL: ఎమ్మిగనూరు పట్టణ ప్రజలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి, ఖాళీ స్థలాల పన్నును ఒకేసారి చెల్లించి 5 శాతం రాయితీ పొందాలని ఇవాళ మున్సిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి తెలిపారు. గత మార్చి 31 వరకు ఉన్న పాత బకాయిలను ఏకమొత్తంగా చెల్లిస్తే వడ్డీపై 50 శాతం రాయితీ ఇస్తామని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 13, 2026 / 10:45 AM IST

నిజరూప దర్శనంలో స్వయంభు జంబుకేశ్వరుడు

ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం నిజరూప దర్శనంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయాన్నే స్వామివారికి పురోహితులు రామకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక భక్తులే కాక ఇతర ప్రదేశం నుండి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

April 13, 2026 / 10:43 AM IST

‘రామతీర్థం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి’

VZM: ఏపీలో కూటమి ప్రభుత్వం రామతీర్థం అభివృద్ధిపై ప్రత్యకంగా దృష్టి సారించిందని నెల్లిమర్ల MLA లోకం నాగమాధవి తెలిపారు. సోమవారం రామతీర్థంలో పాత శ్రీరాముడి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో జరిగిన ఘటనపై సరైన న్యాయం జరగలేదన్నారు.

April 13, 2026 / 10:42 AM IST