• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

డ్రంక్ డ్రైవ్‌పై కఠిన చర్యలు

KRNL: గుంతకల్లు–చిప్పగిరి రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులు డ్రంక్ డ్రైవ్ తనిఖీలు బుధవారం చేపట్టారు. ఎస్సై సీవీ నరసింహులు ఆధ్వర్యంలో వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రతకు భంగం కలిగించే చర్యలపై రాజీ ఉండదని SI వెల్లడించారు.

April 9, 2026 / 09:00 AM IST

పరిటాల శ్రీరామ్ తీరుపై లోకేశ్ ఆగ్రహం

సత్యసాయి: టీడీపీ పార్టీ సమీక్షా సమావేశంలో ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సహా పలువురు నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం చెందారు. కార్యక్రమాలు చేపట్టకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.

April 9, 2026 / 08:57 AM IST

ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి: సీఐ

VZM: ప్రశాంత వాతావరణంలో గొల్లపల్లి దాడితల్లి పండుగ నిర్వహించుకోవాలని బొబ్బిలి సీఐ కె. నారాయణరావు కోరారు. బుధవారం సాయంత్రం స్థానిక రావువారివీధిలో గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పండుగ, సిరిమానోత్సవం ప్రశాంతంగా నిర్వహించాలని, అల్లర్లు, గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అల్లర్లు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు.

April 9, 2026 / 08:49 AM IST

తాడిపత్రిలో భారీగా గ్యాస్ సిలిండర్లు సీజ్

ATP: తాడిపత్రి మండల పరిధిలోని వెంకటంపల్లి గ్రామ పొలాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. కంకర్ ఫ్యాక్టరీ వద్ద సిలిండర్లు డంపు చేసినట్లు సమాచారం రావడంతో SI కాటయ్య బృందం దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో 133 డొమెస్టిక్, కమర్షియల్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మురళి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

April 9, 2026 / 08:43 AM IST

రేపు జిల్లాలో మహాత్మా జ్యోతి బాఫూలే జయంతి వేడుకలు

SKLM: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి బాఫూలే 200వ జయంతి వేడుకలను ఈ నెల 11న జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ప్రకటనలో తెలిపారు. శనివారం ఉ.10 గం.లకు నగరంలోని పొన్నాడ వంతెన సమీపంలో ఉన్న ఫూలే పార్కు వద్ద విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు.

April 9, 2026 / 08:43 AM IST

సిలిండర్ కోసం డెలివరీ బాయ్‌పై దాడి..!

VSP: విశాఖలో గ్యాస్ సిలిండర్ కోసం డెలివరీ బాయ్‌పై దాడి చేసిన ఘటన లంకెలపాలెంలో జరిగింది. భీమనపల్లి రమణబాబు (50)పై ఇద్దరు ఇనుపరాడ్‌తో దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా బుకింగ్ చేస్తేనే సిలిండర్ ఇస్తానని చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆటో నుంచి దింపి దాడి చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 08:37 AM IST

ఏటూరు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం

KDP: ఖాజీపేట మండలం ఏటూరు బ్రిడ్జిపై బుధవారం రాత్రి రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడు కమలాపురం ప్రాంతానికి చెందిన గండి వెంకటేష్ గుర్తించారు. పని నిమిత్తం మైదుకూరు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వెంకటేష్‌ను 108 ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 9, 2026 / 08:30 AM IST

మార్కాపురం బస్సు ప్రమాద కుటుంబానికి ఆర్థిక సహాయం

NLR: ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతిచెందిన బొమ్మరాజు చెరువు గ్రామానికి చెందిన ఆత్మకూరు చిన్నయ్య కుటుంబానికి బుధవారం ఉదయగిరి నియోజకవర్గ జై గౌడ ఉద్యమం అధ్యక్షుడు పంది మాల్యాద్రి గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు మిత్రలు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

April 9, 2026 / 08:24 AM IST

పెళ్లి పేరుతో మోసం.. యువకుడి రిమాండ్

E.G: పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకుని ఆపై మోసం చేసిన రాజమండ్రికి చెందిన దవులూరి వినోద్ కుమార్‌ను అమలాపురం పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. జడ్జి అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 

April 9, 2026 / 08:19 AM IST

మహిళా సాధికారతకు కృషి: ఎమ్మెల్యే

కాకినాడలో మహిళల సాధికారతకై నగర పాలక సంస్థ, మహిళా అభివృద్ధి సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన “రీచ్ మై స్టోర్”ను బుధవారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇలాంటి స్టోర్లు ఎంతో దోహదపడతాయన్నారు.

April 9, 2026 / 08:18 AM IST

‘ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలి’

కృష్ణా: గన్నవరం మండలం ముస్తాబాదులో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక మాట్లాడారు. పత్రికల విలువలను దిగజార్చి, అసభ్యంగా మాట్లాడే స్థాయికి దిగజారిన ఏబీఎన్ రాధాకృష్ణ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. మాజీ సీఎం జగన్ కుటుంబంపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

April 9, 2026 / 08:16 AM IST

MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఊరట

CTR: మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజంపేట MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి విజయవాడ ACB కోర్టు ఊరటనిచ్చింది. ఆయన ఇకపై ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా పాస్ పోర్ట్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందుకు రూ. లక్ష డిపాజిట్ చేయాలంది. ఈ మేరకు బెయిల్ పిటిషన్ ఆంక్షలు సడలిస్తూ న్యాయవాది తీర్పు ఇచ్చారు.

April 9, 2026 / 08:14 AM IST

నిప్పు పెట్టడంతో డ్రిప్ పరికరాలు దహనం

ATP: పుట్లూరు మండలం పి. చింతలపల్లిలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రిప్ పరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. రామశేఖర్ రెడ్డి అనే రైతు మొక్కజొన్న సాగు కోసం వినియోగించిన పైపులను వేప చెట్టు వద్ద భద్రపరుచుకున్నారు. దుండగులు నిప్పు పెట్టడంతో సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

April 9, 2026 / 08:10 AM IST

జాతీయ రహదారిపై దుర్ఘటన.. బాలుడు స్పాట్ డెడ్

గుంటూరు: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న బాలుడిని ట్రాలీ ఆటో బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

April 9, 2026 / 08:10 AM IST

మన ఊరు మన జెండా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

AKP: కసింకోట మండలం తాళ్లపాలెం, సుందరయ్యపేటలో బుధవారం సాయంత్రం మన ఊరు మన జెండా కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాల్గొని పార్టీ జెండాను ఎగరవేశారు. తాళ్లపాలెం నర్సీపట్నం రహదారిని ఆరు లైన్లతో విస్తరించినట్లు తెలిపారు. ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపడతామన్నారు. ప్రతి ఇంటి పైన కాషాయం జెండా ఎగరాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వర రావు పాల్గొన్నారు.

April 9, 2026 / 08:04 AM IST