• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అగ్నిమాపక పరికరాలకు పరిశీలించిన కలెక్టర్

KRNL: అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియం కారిడార్‌లో అగ్నిమాపక శాఖ ఏర్పాటు చేసిన పరికరాల ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ప్రదర్శనను తిలకించి పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

April 20, 2026 / 01:28 PM IST

మంత్రి బీసీతో నందికొట్కూరు ఎమ్మెల్యే భేటీ

NDL: బనగానపల్లెలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని సోమవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పరస్పరంగా పార్టీ బలోపేతం, అభివృద్ధి అంశాలపై చర్చించారు.

April 20, 2026 / 01:23 PM IST

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.. నగదు స్వాధీనం

KRNL: ఎమ్మిగనూరులో IPL క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదోనికి చెందిన శివమూర్తి అనే వ్యక్తి ఓ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద రూ. 22 లక్షల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆదోని DSP భార్గవి వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

April 20, 2026 / 01:11 PM IST

ఎమ్మెల్యేనీ సత్కరించిన బార్ అసోసియేషన్

W.G: తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల సంఘ భవనంలో సోమవారం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కి అభినందన, సత్కార కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పుసులూరి శ్రీవాస్ ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యేని గజమాలతో న్యాయవాదులు సత్కరించారు. జిల్లా సెషన్ కోర్టు తీసుకురావాలనీ కోరారు.

April 20, 2026 / 01:08 PM IST

వినూత్న రీతిలో అభిమానం చాటుకున్నచిత్రకారుడు

NDL: నందికొట్కూరుకు చెందిన చిత్రకారుడు డా. దేశెట్టి శ్రీనివాస్ తన రక్తంతో CM చంద్రబాబు చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు. CM పుట్టినరోజు పురస్కరించుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అనుక్షణం పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు.

April 20, 2026 / 01:06 PM IST

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని పూజలు

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని కొత్తపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

April 20, 2026 / 01:05 PM IST

ఉచిత అల్పాహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KRNL: సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్లలో ఉచిత అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కల్లూరు అర్బన్ ఎస్టేట్‌లోని అన్న క్యాంటీన్‌లో పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఆమె అల్పాహారం పంపిణీ చేశారు.

April 20, 2026 / 01:04 PM IST

పోషణ పక్వాడలో తల్లి, పిల్లల సంరక్షణపై అవగాహన

VZM: బొబ్బిలి ఐ.సి.డి.ఎస్‌. ఆధ్వర్యంలో CDPO జాగాన విజయలక్ష్మి సోమవారం మండలంలోని కారాడ గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తల్లి పాల ప్రాముఖ్యత, పోషకాహారం, తల్లి పిల్ల సంరక్షణ తదితర అంశాలపై తల్లులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వ్వైజర్‌ ఎన్‌.ప్రభావతి, అంగన్వాడీ కార్యకర్తలు, తల్లులు పాల్గొన్నారు.

April 20, 2026 / 01:03 PM IST

‘జీడి మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలి’

శ్రీకాకుళం జిల్లాలో రైతులు పండిస్తున్న మొక్కజొన్న, జీడి పంటలకు ప్రభుత్వం మద్దతుధర కల్పించి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. మోహన్ రావు అన్నారు. సోమవారం జిల్లాపరిషత్ సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదు నమోదు మరియు పరిష్కార వేదికకు దరఖాస్తు సమర్పించారు. 80 కేజీల జీడిపిక్కలు బస్తాకు 16వేలు మద్దతుధర ఇవ్వాలన్నారు.

April 20, 2026 / 01:02 PM IST

కోనసీమ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా RS కుమార్

కోనసీమ: జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆర్ఎస్ కుమార్ ఈశ్వరన్ సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది అభినందనలు తెలిపారు. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వ నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలన్నారు. నిబంధనలు విస్మరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

April 20, 2026 / 01:01 PM IST

జగ్గంపేట డిప్యూటీ MPDO గుండెపోటుతో మృతి

KKD: జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీవో VVVSN మూర్తి సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. రాజానగరంలోని తన స్వగృహం వద్ద ఉండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. సీనియర్ అసిస్టెంట్‌గా జగ్గంపేట వచ్చిన ఆయన, పదోన్నతి పొంది డిప్యూటీ ఎంపీడీవోగా సేవలందిస్తున్నారు. ఆయన మృతి పట్ల మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు.

April 20, 2026 / 01:01 PM IST

పిచ్చాటూరులో సీసీ రోడ్డు ప్రారంభం

తప్త: పిచ్చాటూరులో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్డును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. రైతులకు భరోసా పథకాలు, పెన్షన్ పెంపుతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని తెలిపారు.

April 20, 2026 / 12:54 PM IST

ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

CTR: ఐరాల మండలం పొలకల సంత గేటు వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని ఎమ్మెల్యే మురళీమోహన్ సోమవారం ఆవిష్కరించారు. టీడీపీ నాయకులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఘనత సీఎంకు దక్కిందని ఆయన వెల్లడించారు. ఆయనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.

April 20, 2026 / 12:35 PM IST

సమాజానికి సమానత్వం, సేవా భావం అవసరం

VZM: విజయనగరం కలెక్టరేట్‌లో నిర్వహించిన మహాత్మ బసవేశ్వర జయంతి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బసవేశ్వరుని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా JC మాట్లాడుతూ.. మహానుభావుడు బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, సేవా భావం వంటి విలువలను ప్రతిష్ఠించారని అన్నారు.

April 20, 2026 / 12:34 PM IST

సత్యవేడులో పేట్రేగిపోతున్న గ్రావెల్ మాఫియా.?

TPT: సత్యవేడు మండలంలో గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతూ టిప్పర్ల ద్వారా తమిళనాడుకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. మదనంజేరి గ్రామంలో సర్వేనంబర్ 186/3 లో 5-00 ఎకరాల మేత బీడు భూముల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలే ఇందుకు సాక్ష్యం అంటున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

April 20, 2026 / 12:30 PM IST