ELR: వైసీపీ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక టీవీ ఛానల్ యజమానిని తక్షణమే అరెస్ట్ చేయాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. గురువారం ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చేబ్రోలు ఎస్ఐ సూర్యభగవాన్‌కు ఫిర్యాదు చేశారు.
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గురువారం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
KRNL: బీసీల ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం బీసీవై పార్టీ చేపట్టిన 5 ప్రధాన డిమాండ్లకు కర్నూలు జిల్లా బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల కేటాయింపు, సమగ్ర కులగణన చేపట్టడం, చట్టసభలు, ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
KDP: రంగస్థల నాటకాన్నే శ్వాసగా భావించి జీవించిన ఆల్లూరి వెంకటయ్య జీవితం ధన్యమని ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి కొనియాడారు. కడపలోని జిల్లా రచయితల సంఘం కార్యాలయంలో వెంకటయ్య 89వ జయంతి వేడుకలు నిర్వహించారు. నంది నాటకోత్సవాల్లో జిల్లాకు 28 నంది పురస్కారాలను అందించిన ఘనత వెంకటయ్యకే దక్కుతుందన్నారు. తన తర్వాత కూడా నాటక కళ బ్రతికి ఉండాలని ఆయన పేర్కొన్నారు.
NDL: డోన్ మార్కెట్ యార్డ్‌లో గురువారం జరిగే పశువుల సంతలో కొనుగోలు చేసిన పశువులను వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో వాహనాల్లో తరలిస్తున్నారని పట్టణ అధ్యక్షులు బద్రి ఫిర్యాదు చేశారు. పశువులకు ఇరుకుగా కాకుండా తగిన దాణా, నీటి సదుపాయాలతో రవాణా చేయాలని కోరారు. అలాగే ప్రతి గురు, శని వారాల్లో పశువుల అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు వినతి అందజేశారు.
ఏలూరు జిల్లాలో నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ద్వారా చేపట్టవలసిన పనులు, కాల్వలు, చెరువుల వివరాలను సమర్పించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం నాటికి నీటి వనరులన్నింటినీ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యంతో సిద్ధం చేయాలన్నారు.
TPT: నారాయణవనం మండలంలో విద్యుత్ శాఖ ఏఈని చేనేత శాఖ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పృధ్వీరాజ్ కలిసి, చేనేత కార్మికులకు ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలు నేపథ్యంలో వివరాలు సమర్పించారు. నారాయణవనం, పాలమంగళం ఉత్తరం, పాలమంగళం దక్షిణం, తుంబురు గ్రామాలకు చెందిన చేనేత కార్మికుల వివరాలను అందజేశారు.
CTR: మంత్రి నారా లోకేష్‌ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సేవలపై చర్చ జరిగింది. పార్టీ బలోపేతంపై కృషి చెయ్యాలన్నారు.
సత్యసాయి: లేపాక్షి పంచాయతీ వాహన పార్కింగ్ హక్కుల కోసం గురువారం నిర్వహించిన వేలంపాట ఉత్కంఠగా సాగింది. పోటాపోటీగా జరిగిన ఈ వేలంలో సైఫుల్లా రూ.36.51 లక్షలకు పార్కింగ్ హక్కులను దక్కించుకున్నారు. అలాగే, వారపు సంత వేలాన్ని నయాజ్ రూ.3 లక్షలకు కైవసం చేసుకున్నారు. ఎంపీడీవో నరసింహులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.
E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం APCNF ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ కీర్తి చేకూరి హాజరై ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. రైతులు వరి పంటలపై మాత్రమే ఆధారపడకుండా పంటల వైవిధ్యాన్ని అవలంబించాలని సూచించారు.
కర్నూలు: పాత వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఆశపడి రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహనాలు కొనవద్దని, ఆ వాహనాలను కొని ఇబ్బందులు పాలవ్వకూడదని జిల్లా ప్రజలకు తెలిపారు.మోటారు వాహనాల చట్టం ప్రకారం, సరైన పత్రాలు లేని వాహనాలను కలిగి ఉండటం లేదా నేరమని తెలిపారు.
W,G: తాడేపల్లిగూడెం ఉల్లిపాయల మార్కెట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద క్యూబాకు మద్దతుగా జోలిపట్టి కార్యక్రమం గురువారం సీపీఎం నేతలు నిర్వహించారు. ఇరాన్ తర్వాత క్యూబా దేశంపై దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించడంతో పాటు ఆ దేశానికి వచ్చే ఎగుమతి, దిగుమతులపై ఆంక్షలు విధించడం సరికాదని సీపీఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు అన్నారు.
అన్నమయ్య: రాయచోటీ మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. ట్రైనర్లు గౌస్ పీర్, ఇంతియాజ్ ఖాన్, జఫరుద్దీన్, వెంకట రమణ శిక్షణ అందించారు. రెండు బ్యాచ్‌లుగా 50 మందికి చొప్పున డేటా సేకరణ, ఫీల్డ్ మార్గదర్శకాలపై వివరించారు. ఫీల్డ్‌లో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు ఇచ్చారు.
PLD: నరసరావుపేట మండలం చింతలపాలెం గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు, దివంగత కడియం కోటి సుబ్బారావు విగ్రహావిష్కరణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు.
KDP: మైలవరం మండల తహశీల్దార్ ఓతూరు షఫీ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ముద్దునూరు MLS పాయింట్లో డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేసిన ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ పనులు, రీసర్వే సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.