• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ధవలేశ్వరంలో నది కోత నివారణకు పటిష్ట చర్యలు

EG: ధవలేశ్వరం వద్ద గోదావరి నదీ కోతకు గురవడంతో లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. చెన్నై ఐఐటి గ్రోయిన్స్‌ను డిజైన్ తో పూర్తి పటిష్టంగా రాతి కట్టడంతో వీటిని నిర్మించడానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్నరివిట్మెంట్ నుంచి1 గ్రోయిన్స్ బ్యారేజ్ వైపు 40 మీటర్ల పొడవున గోదావరి నదిలోకి నిర్మిస్తారు .2,3 గ్రోయిన్స్‌ను 45 మీటర్లు పొడవున నిర్మించనున్నారు.

April 18, 2026 / 01:44 PM IST

నీటి వనరులను పెంచుకోవడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం

తిరుపతి రూరల్ (మం) పేరూరు చెరువు వద్ద నీటి సంరక్షణకు-సుస్థిర ఆంధ్రకు మార్గం అనే కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్లు,ఎమ్మెల్యే పులివర్తి నాని చేపట్టారు. చెరువుకట్ట పరిసరాలను పరిశీలించారు. చెరువు కట్ట సంరక్షణకు జలవనరుల శాఖ అధికారులకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు.100 రోజులు నిర్వహించే ఈ కార్యక్రమంలో నీటి వనరులను పెంచుకోవడమే ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.

April 18, 2026 / 01:44 PM IST

జిల్లాలో 38 లీటర్ల సారా స్వాధీనం

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శనివారం పోలీసులు కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనుమానస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. నగరి పరిధిలో 13 లీటర్ల నాటుసారా, పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో 25 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 150 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

April 18, 2026 / 01:43 PM IST

హైకోర్టు జడ్జిని కలిసిన పుంగనూరు న్యాయవాదులు

CTR: పుంగనూరులో న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేయాలని న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ కోరారు. చిత్తూరు జిల్లా పర్యటన నిమిత్తం శనివారం చిత్తూరుకు వచ్చిన హైకోర్టు జడ్జి జయసూర్యను కలిసి పుంగనూరులో ఉన్న జడ్జిల సమస్యను ఆయనకు విన్నవించి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు విజయ్ కుమార్ తెలిపారు.

April 18, 2026 / 01:37 PM IST

DGP ఆదేశాలతో ఆపరేషన్ వజ్రప్రహర్ తనిఖీలు

PPM: రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలమేరకు మాదక ద్రవ్యాల కట్టడిపై ఆపరేషన్ వజ్రప్రహర్ బాగంగా జిల్లాలోని పలు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న పలు గ్రామాల్లో శనివారం కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు నేరాలు అరికట్టలాల్డమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేశామని చెప్పారు. సమాచారం ఇచ్చే వారి పట్ల గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

April 18, 2026 / 01:36 PM IST

ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మెడికల్ కిట్ల పంపిణీ: ఎస్పీ

TPT: జిల్లా పోలీసు కార్యాలయం నందు ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి మెడికల్ కిట్లను ఎస్పీ సుబ్బరాయుడు అందజేశారు. తీవ్ర వేసవి ఎండల నేపథ్యంలో రహదారులపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ శ్రీమతి శ్రీ గీత కుమారి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

April 18, 2026 / 01:34 PM IST

ఎండాడలో హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహానికి శంకుస్థాపన

VSP: సాగర్ నగర్ సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ వెనుక భాగంలో, ఎండాడ పరిధిలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హైకోర్టు న్యాయమూర్తుల అతిథి గృహానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవి ఎన్. తిల్హరి, రవి చీమలపాటి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజుపాల్గొన్నారు.

April 18, 2026 / 01:33 PM IST

‘భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆరాధనోత్సవాలు’

KDP: బ్రహ్మంగారి మఠంలో ఈనెల 23 నుంచి 28 వరకు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల ఆరాధనోత్సవాల సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆర్డీవో చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, మెడికల్ క్యాంపులు, భద్రతా బందోబస్తు, వడదెబ్బ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. యాత్రికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

April 18, 2026 / 01:30 PM IST

గంజాయి పై విద్యార్థులకు ఎస్సై అవగాహన

VZM: ఎస్.కోట పట్టణ పరిధి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గంజాయి పై విద్యార్థులకు పట్టణ ఎస్సై ఎల్. చంద్రశేఖర్ శనివారం అవగాహన కల్పించారు. గంజాయికి సేవిస్తే జీవితాలు నాశనం అవుతాయని, దానివల్ల కుటుంబం సర్వనాశనం అవుతుందని గుర్తు చేశారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, విక్రయించిన, సేవించిన స్టేషనుకు పిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

April 18, 2026 / 01:27 PM IST

పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ

KRNL: పెద్దకడబూరు మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో శనివారం స్వర్ణ ఆంధ్ర–స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో EORD జయరాముడు, పంచాయతీ కార్యదర్శి ఈరన్న పాల్గొని గ్రామంలో పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామ ప్రజలు కూడా పాల్గొని పరిసరాలను శుభ్రం చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు.

April 18, 2026 / 01:27 PM IST

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఎస్పీ

KKD: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కోరారు. శనివారం కాకినాడ ఏఆర్ పోలీస్ క్వార్టర్స్ వద్ద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలునాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

April 18, 2026 / 01:25 PM IST

ప్రకృతి వనరులను కాపాడుకోవాలి: ఎమ్మెల్యే

కోనసీమ: ప్రకృతి వనరులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని చంద్రన్న పార్క్‌లో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర జలధార కార్యక్రమంలో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు జల సంరక్షణ, పట్టణ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

April 18, 2026 / 01:23 PM IST

కేంద్ర మంత్రి విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణి

ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న MLA బండారు శ్రావణి శనివారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. తోటి ఎమ్మెల్యేలు, టీడీపీ ఎంపీలతో కలిసి ఈ విందులో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నేతలతో రాజకీయ అంశాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. కేంద్ర మంత్రితో జరిగిన ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

April 18, 2026 / 01:21 PM IST

మదనపల్లిలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర

అన్నమయ్య: మదనపల్లి పట్టణంలోని గొల్లపల్లి రోడ్ కోమటివాని చెరువు ఆర్చ్ వద్ద శనివారం ఉదయం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. “నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే ఈ నెల థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ భాషలు పాల్గొన్నారు.

April 18, 2026 / 01:19 PM IST

పెళ్లకూరులో “స్వచ్ఛ ఆం ధ్ర-స్వచ్ఛ దివస్”కార్యక్రమం

TPT: పెళ్లకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర” అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం అని తెలియజేశారు. అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఆసుపత్రి ప్రాంగణంలో “స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్” కార్యక్రమం చేపట్టారు.

April 18, 2026 / 01:15 PM IST