• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అగ్నిప్రమాదం బాధితుడికి ఎమ్మెల్యే ఆర్దిక సహాయం

VZM: బొబ్బిలిలో ఈవాళ ఆటోమొబైల్‌ షాపులో అగ్నిప్రమాదం సంభవించ విషయం తెలిసిందే. పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్డం జరిగిన షాపు యజమాని ఆరికతోట గ్రామానికి చెందిన బుగత అచ్యుతరావుకు స్దానిక MLA బేబినాయన వెంటనే స్పందించి అతడికి రూ.20 వేలు తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ మేరకు ఇందిరమ్మ కాలనీ పెద్దల ద్వారా ఈ మొత్తాన్ని బాధితునికి అందజేసారు.

April 25, 2026 / 03:51 PM IST

వరి కోత పనులను పరిశీలించిన కలెక్టర్

W.G: నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో వరి కోత పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి పరిశీలించారు. హార్వెస్టర్ ద్వారా జరుగుతున్న కోత పనులపై రైతులతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు PMDS కిట్లు పంపిణీ చేశారు. డీజిల్ కొరత నేపథ్యంలో హార్వెస్టర్ యజమానులకు కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టి కూపన్లు అందజేశారు.

April 25, 2026 / 03:43 PM IST

గంగాభవాని ఆలయంలో అన్నసంతర్పణ

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1పరిధి బంగారుపేట గ్రామ శివారులో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారి 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం గంగాభవాని ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో అమ్మవారికి పలు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

April 25, 2026 / 03:41 PM IST

ఎమ్మెల్యేను కలిసిన నూతన డ్వామా పీడీ

NDL: జిల్లా NREGS డ్వామా పీడీగా నరసింహ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ గౌరు వెంకట రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిపాలనా అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. పీడీకి గౌరు దంపతులు శుభాకాంక్షలు తెలిపారు.

April 25, 2026 / 03:40 PM IST

మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతమైతే కఠిన చర్యలు: ఎమ్మెల్యే

SS: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండ్, సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఆస్తులు అన్యాక్రాంతమైతే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా సొంత నిధులతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని అన్నారు.

April 25, 2026 / 03:34 PM IST

ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచాలి: ఎమ్మెల్యే

KRNL: ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో MLA జయనాగేశ్వర్ రెడ్డి పోలీస్, మున్సిపల్ శాఖల అధికారులతో ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరచడానికి ప్రధాన కూడళ్లలో CCకెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఓం శాంతి సర్కిల్, మార్కెట్ యార్డు, మచాని సోమప్ప సర్కిల్ ప్రాంతాల్లో సిగ్నల్ ఏర్పాటుపై చర్చించారు.

April 25, 2026 / 03:33 PM IST

‘క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి’

KDP: జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో రాయలసీమ రీజియన్ హోమ్ గార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డ్స్ పెరేడ్‌ను పరిశీలించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.హోంగార్డుల సేవలు కీలకమని పేర్కొంటూ, ఆరోగ్యం, రోడ్డు భద్రతపై అవగాహన అవసరమని చెప్పారు. దర్బార్‌లో సిబ్బంది సమస్యలు విన్న కమాండెంట్ పరిష్కారానికి హామీ ఇచ్చారు.

April 25, 2026 / 03:27 PM IST

ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

NTR: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాలలో సౌమ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేసారు.

April 25, 2026 / 03:25 PM IST

నెల్లూరు నగరపాలక సంస్థలో కారుణ్య నియామకం

NLR: నగర పాలక సంస్థలో కారుణ్య నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ మరణించిన సిద్దికట్టి శ్రీనివాసులు కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే దిశగా, ఆయన కుమారుడు శివకుమార్‌కు ఆయిలర్‌గా ఉద్యోగం కేటాయించారు. ఈ మేరకు కమిషనర్ వై.ఓ. నందన్ ఉత్తర్వులు జారీ చేశారు.

April 25, 2026 / 03:24 PM IST

రెవెన్యూ కార్యకలాలలో మరింత వేగం పెంచాలి: JC

PPM: రెవిన్యూ సంబంధిత కార్యకలాపాలలో మరింత వేగం పెంచాలని JC యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. శనివారం కలక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రీ సర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకతతో నిర్ణత గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పనిచేస్తూ వెరిఫికేషన్‌ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్నారు.

April 25, 2026 / 03:24 PM IST

జాబ్ మేళాలో 106 మందికి ఉద్యోగ అవకాశాలు

శ్రీకాకుళం: నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో 106 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపారు. శనివారం జరిగిన జాబ్ మేళాలో వివిధ కంపెనీలకు చెందిన ఉద్యోగాలకు 227 మంది హాజరు అయ్యారని వివరించారు. ఇంటర్వ్యూలు నిర్వహించి 106 మందిని ఎంపిక చేశారన్నారు.

April 25, 2026 / 03:21 PM IST

జంక్ ఫుడ్ వద్దు–హెల్తీ ఫుడ్ ముద్దు: ఎమ్మెల్యే

BPT: అంగన్వాడీ కార్యకర్తల సేవలు అభినందనీయమని, బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ నడుం బిగించాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన “కిశోరి వికాసం–2026” వేసవి శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

April 25, 2026 / 03:20 PM IST

తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష

ATP: తాగునీటి ఎద్దడి పరిష్కారంపై ఎమ్మెల్యే పరిటాల సునీత సమీక్ష నిర్వహించారు. రూరల్ ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సత్యసాయి తాగునీటి సరఫరా సంస్థ ఎస్‌ఈ, స్థానిక నాయకులతో కలిసి చర్చించారు. మండలంలోని గ్రామాలు, నగర శివారు కాలనీలలో నెలకొన్న నీటి ఇబ్బందులను వెంటనే తొలగించాలని ఆమె ఆదేశించారు.

April 25, 2026 / 03:20 PM IST

కంచికచర్లలో భారీగా ట్రాఫిక్ జామ్

NTR: కంచికచర్లలోని ప్రధాన రహదారిపై శనివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇంధన కొరత నేపథ్యంలో డీజిల్ కోసం భారీ వాహనాలు బంకుల వద్ద రహదారిపైనే క్యూ కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు.

April 25, 2026 / 03:19 PM IST

వెంకటగిరిలో VOAలకు 5G ఫోన్ల పంపిణీ

TPT: వెంకటగిరి నియోజకవర్గంలో VOAలకు సుమారు రూ. 30 లక్షల విలువైన 5G స్మార్ట్‌ఫోన్లను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టడంలో VOAలు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.  2047 నాటికి పేదరికం నిర్మూలనే లక్ష్యమన్నారు.

April 25, 2026 / 03:18 PM IST