ATP: గుత్తి వీరారెడ్డి కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
W.G: పెంటపాడు మండలం ముదునూరులో అద్దంకి విజయరత్నం ఆధ్వర్యంలో ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే అంబేద్కర్ ఆశయ సాధనాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.
CTR: వెదురుకుప్పం మండలం మారేపల్లి గ్రామంలో ఏప్రిల్ 14న డా. బీ.ఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయవలసిందిగా గ్రామ పెద్దలు, యువకులు టీడీపీ మండల అధ్యక్షులు మోహన్ మురళిని ఆహ్వానించారు. మోహన్ మురళి కార్యక్రమానికి తన వంతు సహకారంగా రూ. 10,000 విరాళం అందజేశారు.
SKLM: గంగు వాడ గ్రామంలో ‘పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్’ పథకాన్ని ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ విఠల్ పాల్గొన్నారు.
TPT: సామాజిక విప్లవకారుడు, వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి బిందేశ్వరి ప్రసాద్ (బీపీ) మండల్ వర్ధంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. సోమవారం స్థానిక డీబీఆర్ రోడ్డులోని మండల్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెనుకబడిన తరగతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మండల్ కమిషన్ ద్వారా రిజర్వేషన్లను ప్రతిపాదించిన గొప్ప సంస్కర్త బీపీ మండల్ అని నాయకులు కొనియాడారు.
VZM: బొబ్బిలి పట్టణంలో ఉన్న “అన్న క్యాంటీన్” ఆవరణలో ప్రజలు భోజనం చేసేందుకు నూతన షెడ్డును సోమవారం MLA బేబీనాయన ప్రారంభించారు. ఇటీవల “అన్న క్యాంటీన్” ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో ఎండ తీవ్రత కారణంగా భోజనం చేసేవారు ఇబ్బంది పడుతున్న సంగతి MLA దృష్టికి వచ్చింది. ఈ మేరకు MLA మున్సిపల్ అధికారులతో మాట్లాడి షెడ్డును ఏర్పాటు చేశారు.
KDP: బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కె.రితేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ కలెక్టర్ డా. చేకూరి శ్రీధర్ బద్వేల్ మండలం చింతలచెరువు గ్రామానికి రానున్నట్లు రితేష్ తెలిపారు. ‘జలధార’ ప్రాజెక్టుపై మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సమీక్ష సమావేశానికి ఆయకట్టు ఛైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
PLD: జిల్లాలో ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సూచించారు. కలెక్టరేట్ కార్యాలయంలో అర్జీదారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల వల్ల అలసటకు గురయ్యే ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
NDL: ఆళ్లగడ్డ మండలం బత్తులూరు గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో పశుగ్రాస వాములు దగ్ధమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఘటన స్థలాన్ని రాష్ట్ర రైతు సంఘం నాయకులు టి.రామచంద్రుడు, శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు విచారణ జరిపి రైతులకు అండగా నిలవాలని కోరారు.
ELR: ద్వారకాతిరుమలలో 1986లో స్థాపించబడిన ప్రభుత్వ గ్రంథాలయం నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడుతోందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. భవనం కూడా పూర్తిగా శిధిలమయ్యే స్థాయికి చేరిందని పుస్తక ప్రేమికులు తెలియజేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రంథాలయాన్ని ఆధునికరించి పుస్తక ప్రియులకు అందుబాటులోకి తెస్తే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
KRNL: మంత్రాలయం సీఐ రామాంజులు సాధారణ బదిలీల్లో భాగంగా ఇవాళ పులివెందుల ట్రాఫిక్ సీఐగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కర్నూలు వీఆర్‌లో ఉన్న దస్తగిరి బాబును మంత్రాలయం సీఐగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన దస్తగిరి బాబు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
E.G: రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీగా శివ ప్రియ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజిబుల్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్కి ప్రాధాన్యం ఇస్తామని ఆమె వెల్లడించారు. జోన్‌లోని ఇబ్బందికర ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. అలాగే రాత్రి వేళల్లో గస్తీని పటిష్టం చేస్తామన్నారు.
కృష్ణా: గుడివాడ డీఎస్పీగా పాల శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గుడివాడ పరిధిలో చట్టం, శాంతి భద్రతలను కట్టుదిట్టంగా అమలు చేయడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ, నేరాల నివారణ, ట్రాఫిక్ యంత్రణపై దృష్టి సాధిస్తామన్నారు.
VSP: జీవీఎంసీ ఆస్తుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించే టెండర్‌పై జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ద్వారా టెండర్లు పిలవడం నిబంధనలకు విరుద్ధమని, ఇందులో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. టెండర్‌ను వెంటనే రద్దు చేసి, స్మార్ట్ సిటీ పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
TPT: తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 19 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 22న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించనున్నారు. ఆయన జన్మనక్షత్రం అరుద్ర సందర్భంగా ఏటా ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామానుజులవారిని బంగారు తిరుచ్చిపై మాడ వీధుల్లో ఊరేగించారు.