• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోండి

ATP: ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతులు తమ పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలని కెనరా బ్యాంక్ మేనేజర్ గురుమూర్తి కోరారు. రైతులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, వన్ బి అడంగల్ తీసుకొని రైతులు తమ పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.

April 17, 2026 / 11:26 AM IST

నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్

NLR: ఆత్మకూరు మండలం, కరటంపాడు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటోలో ఓ మహిళా ప్రయాణికురాలు ఫోన్ మరిచి వెళ్లిపోయినట్లు గుర్తించిన ఆటో డ్రైవర్ విజయ్ కుమార్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్సై జిలానికి అందించాడు. ఎస్సై జిలాని మాట్లాడుతూ.. ఈ ఫోన్‌కి సంబంధించిన ఆధారాలు చూపించి ఫోన్ తీసుకెళ్లాలని సూచించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్‌ను ఎస్సై అభినందించారు.

April 17, 2026 / 11:24 AM IST

ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణాల అద్దెకు ఆహ్వానం

సత్యసాయి: జిల్లాలోని పుట్టపర్తి ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగులు, వ్యాపారస్తులకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్థానిక పుట్టపర్తి డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

April 17, 2026 / 11:21 AM IST

అగ్నిప్రమాద బాధితుడికి అండగా వైసీపీ నేతలు

KRNL: పెద్దకడబూరులోని లక్ష్మీపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధమయి సర్వం కోల్పోయి వీధిన పడ్డ జెల్లి అంజినయ్య కుటుంబానికి వైసీపీ నేతలు అండగా నిలిచారు. శుక్రవారం వైసీపీ నేతలు రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శివరామరెడ్డి, విజయేంద్ర రెడ్డి బాదిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యవసర వస్తువులు, రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

April 17, 2026 / 11:19 AM IST

‘టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం’

VZM: నూతనంగా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమింపబడ్డ గంట్యాడ శ్రీదేవి శుక్రవారం టీడీపీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబునాయ, మంత్రులు లోకేష్, కొండపల్లి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రజలకు చేరువ చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

April 17, 2026 / 11:17 AM IST

‘సీజనల్ వ్యాధులు పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి’

SKLM: ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అధ్యక్షతన పొన్నాడలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. రానున్న వర్షాకాల సీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని, ప్రజలను వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. హాస్పిటల్ నందు మందుల నిర్వహణ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టీలు పరిశీలించారు.

April 17, 2026 / 11:16 AM IST

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

గుంటూరు: తెనాలికి చెందిన ఇస్కఫ్, సాయి మంగా వెల్ఫేర్ సొసైటీ, డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. నందులపేటలోని సీనియర్ సిటిజన్స్ భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి మంచి స్పందన లభించింది. శిబిరానికి వచ్చిన పలువురికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వైద్య సలహాలు అందజేశారు.

April 17, 2026 / 11:12 AM IST

బుక్కాపురంలో YCP శిలాఫలకం ధ్వంసం..!

NDL: మహానంది మండలం బుక్కాపురంలో YCP శిలా ఫలకాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామంలో రైస్ మిల్లు నుంచి శ్మశానం వరకు సుమారు రూ. 7 లక్షలతో వైసీపీ ప్రభుత్వంలో రహదారిని నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గురువారం రాత్రి దుండగులు ధ్వంసం చేసినట్లు ఆ పార్టీ గ్రామ నాయకుడు కందుల రఘురామిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలుత తెలియాల్సి ఉంది.

April 17, 2026 / 11:09 AM IST

పశు వైద్య శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: పాడి రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మురళీ మోహన్ సూచించారు. తవణంపల్లి మండలం దిగువ మోదాల పల్లిలో బంగారుపాలెం ఏఎంసీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం పట్ల రైతులకు అవగాహన కల్పించడమే శిబిరం ఉద్దేశం అన్నారు.

April 17, 2026 / 11:09 AM IST

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా శ్రీధర్

W.G: తాడేపల్లిగూడెం మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ గొర్రెల శ్రీధర్ టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులయారు. ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు ఆయనను కలసి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.

April 17, 2026 / 11:04 AM IST

అండర్-15 బాలికల క్రికెట్ జట్ల ఎంపిక

ATP: జిల్లా క్రికెట్ సంఘము ఆధ్వర్యంలో ఈ నెల 18న సీనియర్ మహిళలకు, 19న అండర్-15 బాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి యుగంధర్ రెడ్డి తెలిపారు. ఆర్డిటిలో నిర్వహించే ఎంపిక పోటీలకు హాజరై క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, క్రీడా సామాగ్రి, యూనిఫామ్‌తో హాజరు కావాలన్నారు.

April 17, 2026 / 11:01 AM IST

ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత చర్యలు

E.G: రాజమండ్రిలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి శుక్రవారం విస్తృత చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ డీఎస్పీ వై.శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలు జంక్షన్ల వద్ద సమగ్ర పరిశీలన నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పరిస్థితులను మెరుగుపరచడానికి డ్రోన్ కెమెరాల ద్వారా పరిశీలనలు నిర్వహించారు.

April 17, 2026 / 11:00 AM IST

విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి

కోనసీమ: అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఉండ్రాజవరపు శ్రీను(43) విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం వీధి దీపాలు వేసేందుకు కరెంటు స్తంభం ఎక్కి లైట్లు బిగిస్తుండగా 11 కేవీ వైర్లు తగిలి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.

April 17, 2026 / 10:50 AM IST

శ్రీకృష్ణ గీతాశ్రమం ఆదాయ వివరాలు వెల్లడి

KDP: ప్రొద్దుటూరులో 1946లో నామ ఎరుకలయ్య ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ గీతాశ్రమం ఆదాయ వివరాలను ఈవో శ్రీధర్ శుక్రవారం వెల్లడించారు. ఆశ్రమానికి 5 కాలేజీల నుంచి రూ.65.41 లక్షలు, షాపులు, ఇళ్ల బాడుగల ద్వారా రూ.29 లక్షలకు పైగా ఆదాయం వస్తోందని తెలిపారు. 38.96 ఎకరాల భూముల కౌలుతో పాటు రూ.2.01కోట్ల ఎల్డీలపై వడ్డీ వస్తోందని పేర్కొన్నారు.

April 17, 2026 / 10:48 AM IST

ఊపందుకున్న అమరావతి ఐకానిక్ భవనాల నిర్మాణం

గుంటూరు: అమరావతిలో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇక్కడ మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారు. వీటిలో 1 నుంచి 4 టవర్లను జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ప్రధానమైన ఐదో టవర్‌ను ఏకంగా జీ+49 అంతస్తులతో భారీగా నిర్మిస్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి ఈ టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది.

April 17, 2026 / 10:48 AM IST