• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది వైసీపీనే’

PLD: పెద్దకూరపాడు నియోజకవర్గ చరిత్రలోనే అభివృద్ధి జరిగిందంటే వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని తాడికొండ YCP పరిశీలకులు ఈదసాంబిరెడ్డి అన్నారు. ఏ గ్రామంలో చూసిన రోడ్లు, సచివాలయాలు, ఆర్బికేల నిర్మాణం జరిగిందన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వైసీపీకే దక్కిందన్నారు.

April 15, 2026 / 09:31 PM IST

దేవనకొండ మండలంలో ప్రత్యేక అధికారుల నియామకం

KRNL: దేవనకొండ మండలంలోని 26 గ్రామాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. అలారుదిన్నె, దేవనకొండ, కరివేములకు ఎస్.జ్యోతి.. బండపల్లి, గుండ్లకొండ, పాలకుర్తికు మొహమ్మద్ రఫీ, జిలేడుబుడకల, కప్పట్రాళ్లకు బి. ఉషారాణి, కె. వెంకటాపురం-పల్లెదొడ్డికు ఎం. సుదర్శనం, కొత్తపేట, కుంకనూరుకు ఎన్జీ. వెంకటేశ్.. మాచారానికి కె. విజయ నియమితులయ్యారు.

April 15, 2026 / 09:30 PM IST

ఇంటర్‌లో గోడి కళాశాల విద్యార్థులు ప్రతిభ

కోనసీమ: అల్లవరం మండలం గోడిలో ఉన్న అంబేద్కర్ గురుకులం బాలుర కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరంలో 83.33%, ద్వితీయ సంవత్సరంలో 86% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. ఫస్ట్ ఇయర్‌లో రోహిత్ 482 మార్కులు, బాల సందీప్ 435 మార్కులు సాధించారన్నారు.

April 15, 2026 / 09:26 PM IST

ఏల్చూరులో ఓటర్ లిస్ట్ పబ్లికేషన్

BPT: సంతమాగులూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రచురించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ పేర్లు ఓటర్ లిస్ట్‌లో ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. అర్హత కలిగిన వారు పేర్లు లేకపోతే సవరణలు, అభ్యంతరాలు తెలియజేయడానికి అవకాశం ఉందని తెలిపారు.

April 15, 2026 / 09:22 PM IST

ఈనెల 16 నుంచి స్వీయ గణన ప్రక్రియ: కలెక్టర్

NTR: స్వీయ గణన ప్రక్రియను ఈనెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ తెలిపారు. ఈ సందర్భంగా https://se.census.gov.in⁠ పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు కచ్చితమైన డేటా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యంతో పాల్గొని జనగణనను విజయవంతం చేయాలని కోరారు.

April 15, 2026 / 09:00 PM IST

టాప్ 3 నిలవడం గర్వకారణం: మంత్రి

ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరచడంపై రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో ఏకంగా మూడో స్థానానికి చేరుకోవడం గర్వకారణం అని మంత్రి కొనియాడారు. అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడిన టాప్ 3లో నిలవడం నిదర్శమన్నారు.

April 15, 2026 / 09:00 PM IST

తాగునీరు సౌకర్యం కల్పించండి సారు..!

ASR: ముంచంగిపుట్టు మండలంలోని మాకవరం పంచాయతీ కేంద్రంలో తీవ్రమైన నీటి కొరత నెలకొంది. సుమారు 80 కుటుంబాల గిరిజనులు ఒకే బోరు, ఊటగెడ్డ నీటిపై ఆధారపడుతున్నాయి. వేసవి తీవ్రతతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 15, 2026 / 09:00 PM IST

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్.?

GNTR: భారత్‌నెట్, పీఎం-వాణీ పబ్లిక్ వైఫై విస్తరణపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్షించారు. సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే మార్గాలపై చర్చించారు. అమలు ప్రక్రియలు, వ్యయ నిర్మాణంపై పలు సూచనలు చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం నాణ్యమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

April 15, 2026 / 08:44 PM IST

విజయనగరం పట్టణాన్ని జల్లెడ పట్టిన పోలీసులు

VZM: విజయనగరం పట్టణంలో పోలీసులు మెగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇవాళ సాయంత్రం 5 నుంచి వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. మొత్తం 200 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు 1000 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడం, హెల్మెట్ లేకుండా ప్రయాణం, మైనర్ డ్రైవింగ్, సైలెన్సర్ మార్పులపై చర్యలు తీసుకున్నారు.

April 15, 2026 / 08:40 PM IST

కె. పద్మలతా రెడ్డికి కీలక పదవి

కర్నూలుకు చెందిన కె. పద్మలతా రెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఇవాళ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కార్పొరేటర్‌గా పనిచేసిన ఆమె పార్టీకి విశేష సేవలు అందించారు. కర్నూలు నుంచి మహిళగా ఈ పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆమె నియమకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

April 15, 2026 / 08:40 PM IST

‘శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి’

CTR: మహిళలు బాలికల భద్రత కోసం రూపొందించిన శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. చిత్తూరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో మహిళల భద్రత, పిల్లల రక్షణపై శక్తి టీం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

April 15, 2026 / 08:36 PM IST

నేటి నుంచే జనగణన తొలి దశ ప్రక్రియ ప్రారంభం

కోనసీమ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన 2027 తొలి దశ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ టీవీ రంగారావు బుధవారం తెలిపారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ సదుపాయం కలిపించామన్నారు.

April 15, 2026 / 08:33 PM IST

సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

ATP: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో 22ఏ, భూ రీసర్వే, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, డిజిటల్ రెవెన్యూ రిజిస్ట్రీ వంటి అంశాలపై సమీక్షించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. పాసుపుస్తకాల పంపిణీలో జాప్యం జరగకుండా చూడాలని సీఎస్ ఆదేశించారు.

April 15, 2026 / 08:30 PM IST

జిల్లాలో బెల్ట్ షాపులపై ఉక్కుపాదం

KDP: జిల్లా వ్యాప్తంగా మద్యం బెల్ట్ షాపులపై విస్తృతస్థాయిలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకేరోజు 47 కేసు నమోదు చేసి 47 మందిని అరెస్టు చేశారు. 579 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 554 క్వార్టర్ బాటిళ్ల మద్యం, 25 బీర్ బాటిళ్లును స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని ఎస్పీ విశ్వనాథ్ హెచ్చరించారు.

April 15, 2026 / 08:30 PM IST

రికార్డ్ స్థాయిలో అమ్మవారికి భక్తుల బంగారం సమర్పణ

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గంటలకు మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 4 గంటలకు పూర్తయింది. ఈవో, పాలకమండలి సభ్యులు, దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో సీసీటీవీ నిఘా మధ్య లెక్కింపు జరిగిందన్నారు.

April 15, 2026 / 08:29 PM IST