ఇంటర్మీడియట్ ఫలితాల్లో మన్యం జిల్లా అద్భుతమైన ప్రగతిని కనబరచడంపై రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. గతేడాది రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో ఉన్న జిల్లా, ఈ ఏడాది 87 శాతం ఉత్తీర్ణతతో ఏకంగా మూడో స్థానానికి చేరుకోవడం గర్వకారణం అని మంత్రి కొనియాడారు. అభివృద్ధి చెందిన జిల్లాలతో పోటీపడిన టాప్ 3లో నిలవడం నిదర్శమన్నారు.