NTR: స్వీయ గణన ప్రక్రియను ఈనెల 16 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. జీ. లక్ష్మీశ తెలిపారు. ఈ సందర్భంగా https://se.census.gov.in పోర్టల్ ద్వారా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు కచ్చితమైన డేటా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చైతన్యంతో పాల్గొని జనగణనను విజయవంతం చేయాలని కోరారు.