కోనసీమ: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన 2027 తొలి దశ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుందని మున్సిపల్ కమిషనర్, ఛార్జ్ ఆఫీసర్ టీవీ రంగారావు బుధవారం తెలిపారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ సదుపాయం కలిపించామన్నారు.