• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

SWPC షెడ్‌ను సందర్శించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండల కట్టవానిచెరువు గ్రామంలోని SWPC షెడ్‌ను ఎంపీడీవో ఇమ్రాన్ ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్‌లో జరుగుతున్న పనితీరును పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడారు. షెడ్‌లో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకుని, పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

April 15, 2026 / 10:13 AM IST

కాణిపాకం సమీపంలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

CTR: తవణంపల్లి(M) కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని – కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొంది. ఘటనలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 10:09 AM IST

భార్యపై భర్త దాడి.. కేసు నమోదు

ATP: అనంతపురం రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్ తన భార్య తేజస్వినిపై చాకుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న వీరి మధ్య మనస్పర్థాలు రావడంతో, ఆమె పనిచేసే బిర్యానీ సెంటర్ వద్దకు వెళ్లి రాజేష్ గొడవపడ్డాడు. సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

April 15, 2026 / 10:00 AM IST

‘స్వీయ నమోదు విధానాన్ని వినియోగించుకోవాలి’

అన్నమయ్య: జనగణన-2027లో భాగంగా స్వీయ నమోదు విధానాన్ని ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేసుకునే అవకాశం ఉందని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఖచ్చితమైన జనగణనకు సహకరించాలని కోరారు.

April 15, 2026 / 09:58 AM IST

ఈనెల 28న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్

NDL: గడివేములలో పేట లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం పురస్కరించుకుని ఈ నెల 28న రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. మొదటి బహుమతి రూ.50 వేలు, రెండవ బహుమతి రూ.40 వేలు, మూడో బహుమతి రూ.30 వేలు, నాలుగవ బహుమతిగా రూ.20 వేలు ఇవ్వనున్నారు.

April 15, 2026 / 09:55 AM IST

హోళగుందలో అగ్నిప్రమాదం

KRNL: హోళగుంద మండలం సులువాయి గ్రామంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరు గడ్డివాములు మంటల్లో కాలిపోయాయి. ఈరన్న, వసంతకుమార్, రమేష్, పరుశురాంలకు చెందిన గడ్డివాములు అని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగిందిని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 09:49 AM IST

జనసేనలోకి మళ్లీ తోట చంద్రశేఖర్..!

GNTR: మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ మళ్లీ సొంత గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో సమావేశమయ్యారు. జనసేనలో కీలక నేతగా ఉన్న ఆయన గతంలో బీఆర్ఎస్‌లో చేరారు. పవన్‌తో తాజా భేటీతో ఆయన తిరిగి జనసేనలో చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే ఆయన అధికారికంగా పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

April 15, 2026 / 09:46 AM IST

వినూత్నంగా రాజా రవివర్మ చిత్రం

GNTR: ఏప్రిల్ 15న ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా తెనాలి మండలం పెదరావూరు జడ్పీ స్కూల్ డ్రాయింగ్ టీచర్ వెంకటకృష్ణ (కృష్ణశ్రీ) వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏ3 షీట్‌పై ‘ప్రపంచ కళా దినోత్సవం’ అనే అక్షరాలతోనే ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రాన్ని కలర్ పెన్లతో అద్భుతంగా గీశారు. కాగా, లియోనార్డో డా విన్సీ జయంతిని ఏటా ఈ దినోత్సవంగా జరుపుకుంటారు.

April 15, 2026 / 09:43 AM IST

విశాఖ జూలో సింహం మృతి

VSP: విశాఖలోని ఇందిర గాంధీ జూపార్కులో ‘లియో’ అనే 7 సంవత్సరాల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం మృతి చెందింది. అస్సాం నుంచి జంతు మార్పిడి కార్యక్రమం ద్వారా తీసుకువచ్చిన ఈ సింహం క్వారంటైన్లో ఉండగా అనారోగ్యానికి గురైంది. మార్చి 19న పరీక్షల్లో ట్రైపానోసోమియాసిస్, ఎర్లిచియోసిస్ అనే రక్త సంబంధిత వ్యాధులు ఉన్నట్లు తేలింది. దీంతో అవయవాలు పనిచేయక చనిపోయింది.

April 15, 2026 / 09:34 AM IST

వృద్ధుడు మృతి.. వివరాలు తెలియాల్సి ఉంది

TPT: తిరుపతి స్విమ్స్ అన్న క్యాంటీన్ వద్ద ఓ వ్యక్తి చనిపోయి ఉండటాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. మృతుని జేబులో లభించిన వికలాంగుల ఆర్టీసీ బస్సు పాస్ ఆధారంగా అతను అన్నమయ్య జిల్లా గాలివీడు ప్రాంతానికి చెందిన పి.పెంచలయ్యగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. ఎవరైనా గుర్తిస్తే తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ను సంప్దించాలని పోలీసులు కోరారు.

April 15, 2026 / 09:31 AM IST

‘పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేము’

E.G: రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామ పంచాయతిలో రోడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్య ప్రసాద్ బుధవారం ‘మాట – మంతి’ నిర్వహించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. 

April 15, 2026 / 09:30 AM IST

వెంకట్రామన్నగూడెంలో వ్యక్తి దారుణ హత్య

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్న గూడెంలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన దెయ్యాల సూర్యనారాయణ అనే వ్యక్తి తన ఇంటిలో నిద్రిస్తుండగా, ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గోడ దూకి కత్తితో హత్యచేసి పరారయ్యాడు. రూరల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 09:25 AM IST

రెండేళ్లుగా నిలిచిన ప్రహరీ పనులు

ASR: డుంబ్రిగుడ మండలంలోని కించుమండ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా ఉంది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పనులు రెండేళ్లుగా నిలిచిపోయాయి. పూర్తిస్థాయి ప్రహరీ లేకపోవడంతో బయట వ్యక్తులు, మూగజీవాలు లోపలకు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు.

April 15, 2026 / 09:19 AM IST

నేడు సఖినేటిపల్లిలో మెగా ఉచిత వైద్యశిబిరం

కోనసీమ: సఖినేటిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ కేంద్రంలో బుధవారం ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి బిసం తెలిపారు. ఆయుర్వేదం, అల్లోపతితో పాటు ఏఐ వంటి నూతన విధానంలో రోగులకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. 

April 15, 2026 / 09:10 AM IST

మాజీ సీఎంను కలిసిన దువ్వూరు వైసీపీ కన్వీనర్

KDP: మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని దువ్వూరు మండల వైసీపీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పార్టీ పరిస్థితులను శంకర్ రెడ్డి వివరించారు. కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

April 15, 2026 / 09:09 AM IST