పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుద్ధ్య పనులు 24/7 నిర్వహణ, చెత్త డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రోడ్లు-కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రత్యేక అధికారి పాలనలో పట్టణాన్ని ముస్తాబు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
VSP: విద్యుత్ సమస్యల వేగవంత పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ ప్రతి సోమవారం ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమం నిర్వహిస్తోందని ఇమ్మడి పృథ్వి తేజ్ తెలిపారు. సోమవారం ఉదయం 10.30-11.30 వరకు విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. వినియోగదారులు 8688400499కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
ASR: జిల్లా నూతన కలెక్టర్గా టి.నిశాంతి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక పూజలతో కార్యాలయంలో ప్రవేశించి సంతకం పెట్టి బాధ్యతలు స్వీకరించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేశారు.
SKLM: కన్న కొడుకే తండ్రిని హత్య చేసిన ఘటన మందస మండలం లోహరిబంద గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాళ్ల లక్ష్మీనారాయణ(55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులకు డబ్బులు అడుగుతూ ఉండేవాడు. ఈ క్రమంలో డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో కోపంతో తండ్రిని కొట్టగా తలకు తీవ్ర గాయాలై మరణించాడు. దీనిపై ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు.
KRNL: ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, బీసీ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల వసతి సదుపాయాల మెరుగుపై చర్చించారు. ఎంపీ సూచనలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
NDL: మహానంది ఆలయంలో వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లతో పాటు భక్తుల కాళ్లు కాలకుండా కొబ్బరి పీచుతో తయారు చేసిన మ్యాట్లు వేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు చేపట్టామని ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. వేసవికాలం ముగిసే వరకు ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.
W.G: పెంటపాడు మండలం కే.పెంటపాడు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రఘురాం నాయుడు హాజరయ్యారు. అనంతరం పదమరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో దోడిగర్ల చంద్రయ్య, బేతాళ అనిల్ కుమార్, చీకటిమిల్లి రాజీవ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకాశం: ఒంగోలు పట్టణంలోని మంగమూరులో రోడ్లో ఆదివారం తెల్లవారుజామున ఆరుగురిని ఒంగోలు తాలూకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాడిద మాంసం పేరుతో గుర్రాల మాంసాన్ని విక్రయిస్తున్నారని సమాచారం అందింది. ఈ మేరకు మాంసం, ఆటోలు 4, ఓ కారు సజీవంగా ఉన్న రెండు గుర్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సత్యసాయి: సోమందేపల్లిలోని వివేకానంద కాలనీ, సప్తగిరి కాలనీ, ఎస్సీ కాలనీల్లో ఆదివారం నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి, చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించారు. సప్తగిరి కాలనీలో రెండు, ఎస్సీ కాలనీలో రెండు కరెంట్ పోల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ లైన్మెన్ సూర్యనారాయణ, పరంధామ తదితరులు పాల్గొన్నారు.
PLD: జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా జీవించాలని సూచించారు. వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంటుందని హెచ్చరించారు. పాత పద్ధతి మార్చుకోకుండా గొడవలకు, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
GNTR: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. నేతలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఆయనకు నివాళులర్పించారు. కూటమి పాలనలో దళితులపై దాడులు, వేధింపులు పెరిగాయని వారు మండిపడ్డారు. ఓ దళితుడిపై స్పీకర్ అయ్యన్న దాడి చేయడమే ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు. దళితుల కన్నీళ్లకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని నేతలు హెచ్చరించారు.
KRNL: ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు విగ్రహనీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆయన సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలను స్మరించారు. గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని కొనియాడారు.
NDL: బనగానపల్లెకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అల్తాఫ్ హుస్సేన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి ఇందిర రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం పొందాలని సూచించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ELR: జీలుగుమిల్లి మండలలో ఆదివారం బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాబు జగ్జివన్ రామ్ ఉప ప్రధానిగా చేసిన సేవలు ఎంతో కీలకమని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
ప్రకాశం: దోర్నాల మండలంలోని వెలుగొండ ప్రాజెక్టు సందర్శించేందుకు ఈనెల 7వ తేదీన భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. జూలై నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి నీరు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. పనుల పురోగతిని పరిశీలించేందుకు మంత్రి వస్తున్నట్లు తెలుస్తోంది.