• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దళితుడిపై దాడి.. సీఐ ఆరోపణలు

అన్నమయ్య: మదనపల్లి తాలూకాలో సీఐ కళా వెంకటరావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. భూవివాదం నేపథ్యంలో గాంధీపురానికి చెందిన దళితుడు రామయ్యను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, లాఠీలతో దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. అడ్డుకున్న దళిత మహిళలతో కూడా సీఐ అనుచితంగా ప్రవర్తించి బయటకు తోసేశారని బాధితులు పేర్కొన్నారు. గాయపడిన వారు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

April 10, 2026 / 04:14 PM IST

జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్.. 206 వాహనాలు సీజ్

GNTR: జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా 600కు పైగా ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. 326 వాహనాలకు రూ.4 లక్షల ఛలానాలు విధించి, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ ఉల్లంఘనలపై 206 వాహనాలు సీజ్ చేశారు. పట్టుబడిన మైనర్ల తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలపై జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అవగాహన కల్పించారు.

April 10, 2026 / 04:14 PM IST

ఎండలు భగ్గుమంటున్నాయి బాబోయ్.!

PLD: పెదకూరపాడు మండలంలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉంది. సుమారు 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయింది. గురువారం సాయంకాలం వర్షం, శుక్రవారం మధ్యాహ్నం మండుటెండలతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యామన్నారు. రోడ్లన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. జన నివాసాల నుంచి ప్రజలు ఎవరు బయటకు వచ్చేందుకు సుముఖత చూపటం లేదు.

April 10, 2026 / 04:10 PM IST

ఆదోని ప్రత్యేక అధికారిగా జేసీ నూరుల్ ఛార్జ్

KRNL: ఆదోని పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరూల్ ఖమర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ, ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ బీటీ నాయుడు ఆయనను కలిసి ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధిపై కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు.

April 10, 2026 / 04:10 PM IST

జోగి రమేశ్‌పై తెలంగాణలో కేసు నమోదు

NTR: మాజీ మంత్రి జోగి రమేశ్‌పై తెలంగాణలోని ఫిలింనగర్ PSలో కేసు నమోదైంది. ఓ మీడియా సంస్థ కార్యాలయంపై జోగి సహా 19 మంది వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు నమోదు కాగా పోలీసులు BNS 351(2), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ నెల 7న సదరు మీడియా సంస్థ ఫిర్యాదు చేయగా నిన్న కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

April 10, 2026 / 04:07 PM IST

నల్లగొండ రాయుడు స్వామి ఉత్సవాలకు విరాళం

SS: ధర్మవరం మండలం రేగాటిపల్లెలో వెలసిన నల్లగొండ రాయుడు స్వామి జోతుల బాణాల కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఆయన తన వంతుగా రూ. 20 వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 04:07 PM IST

తాడిపత్రిలో డ్రోన్లతో పోలీసుల నిఘా

ATP: తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ASP రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో వీరాపురం, అర్జాస్ ఫ్యాక్టరీ, పెన్నా నది ప్రాంతాల్లో పర్యవేక్షణ చేపట్టారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 10, 2026 / 04:04 PM IST

‘కార్మికులకు ఎల్లప్పుడూ అండగా వైసీపీ పార్టీ’

E.G: రాజమండ్రి శివారు ఆటోనగర్‌లో వాసిరెడ్డి బాబి చలివేంద్రాన్ని శుక్రవారం అమలాపురం వైసీపీ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. కార్మికుల దాహార్తిని తీర్చడం కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆమె వెల్లడించారు. కార్మికులకు ఎల్లప్పుడూ వైసిపి పార్టీ అండగా ఉంటుందన్నారు.

April 10, 2026 / 04:00 PM IST

గ్రీవెన్స్ డేలో ప్రజల సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

GNTR: గుంటూరు నగరంలోని జెకేసీ కాలేజీ రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిపై ఆయన వెంటనే స్పందించారు.

April 10, 2026 / 03:52 PM IST

గ్రీవెన్స్ డేలో ప్రజా సమస్యల పరిష్కారం: ఎమ్మెల్యే

GNTR: గుంటూరు నగరంలోని జెకేసీ కాలేజీ రోడ్డులో ఉన్న తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పలువురు అర్జీదారులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిపై ఆయన వెంటనే స్పందించారు.

April 10, 2026 / 03:52 PM IST

చీరాలలో ప్రజా దర్బార్ కార్యక్రమం

BPT: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య హాజరై, ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అందిన అర్జీలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

April 10, 2026 / 03:49 PM IST

మురుగు నీటి శుద్ధి కేంద్రం పరిశీలించిన కలెక్టర్

KRNL: దేవనగర్ సమీపంలో ఉన్న ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధి కేంద్రం) ఇవాళ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పరిశీలించారు. ప్లాంట్‌లో మురుగు నీటి శుద్ధి ప్రక్రియ, సామర్థ్యం, నిర్వహణ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శుద్ధి చేసిన నీటిని పునర్వినియోగానికి ఉపయోగించే అవకాశాలపై సూచనలు చేశారు. వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

April 10, 2026 / 03:48 PM IST

పంజాబీ నేర్చుకునే విధానంపై వర్క్ షాప్

PLD: పంజాబీ చాలా తేలికైన, అందమైన భాష కొన్ని మెలకువలతో నేర్చుకోవడం సులువని సీహెచ్.నిఖిల్ అన్నారు. పెదకూరపాడు మండలంలోని 75త్యాళ్ళూరు పీఎం శ్రీ ZP పాఠశాలలో పంజాబీ నేర్చుకునే విధానంపై విద్యార్థులకు వర్క్ షాప్ నిర్వహించారు. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి భిన్నత్వంలో ఏకత్వాన్ని పెంపొందించాడానికి అవగాహన కల్పింస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు.

April 10, 2026 / 03:46 PM IST

కారు బోల్తా.. నలుగురికి గాయాలు

NDL: శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాక్షి గణపతి ఆలయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా, వారిని అంబులెన్స్‌లో శ్రీశైల దేవస్థానం వైద్యశాలకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిన కారును తొలగించి ట్రాఫిక్  పునరుద్ధరించారు. ప్రమాద ఘటనపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆరా తీశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 10, 2026 / 03:44 PM IST

వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో విశేష పూజలు

BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో వెలసిన శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

April 10, 2026 / 03:44 PM IST