• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సహాయం

విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు కొబ్బరితోట ప్రాంతానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు చింతల సత్యను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం పరామర్శించారు. ఈ మేరకు ఆమె అనారోగ్య పరిస్థితిని తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తన సొంత నిధుల నుంచి రూ.5,000 నగదు, బియ్యం బస్తా అందజేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 07:00 PM IST

ఘనంగా జగ్జవన్ రామ్ జయంతి వేడుకలు

W.G:పెంటపాడు మండలం ఉమామహేశ్వరం, కె. పెంటపాడు, రాచర్ల, ప్రత్తిపాడు, పట్టింపాలెం గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వల బాబ్జీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సామాజిక న్యాయం, సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని కొనియాడారు.

April 5, 2026 / 06:41 PM IST

సైక్లింగ్‌లో మౌలాబికి సిల్వర్ పతకం

NDL: అమరావతిలో జరిగిన రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మౌలాబి ప్రతిభ కనబరిచి మూడో స్థానం సాధించింది. ఈ విజయంతో ఆమెకు సిల్వర్ పతకం లభించింది. ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు ఇవాళ అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో పాల్గొని బంగారు పతకం సాధించడం తన లక్ష్యమని మౌలాబి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:28 PM IST

పోలీసు చట్టాలపై ప్రజలకు అవగాహన

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో డెంకాడ ఎస్సై ఏ. సన్యాసినాయుడు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీసు చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముఖ్య కూడళ్లలో భారీ ఫ్లెక్సీలను ఆదివారం ఏర్పాటు చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని వీటి ద్వారా సూచించారు.

April 5, 2026 / 06:23 PM IST

‘ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలి’

AKP: కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంపై ప్రభుత్వం స్పందించాలని సీపీఐ నేతలు వెంకటేశ్వరరావు, వైఎన్ భద్రం డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ఆదివారం వారు మాట్లాడుతూ.. సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరణాలు జరిగితే వాటిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు.

April 5, 2026 / 06:22 PM IST

సంస్థాగత ఎన్నికలలో గెలుపు పై ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ELR: జిల్లా జనసేన కార్యాలయంలో ఆదివారం జనసేన నాయకులు, వీర మహిళలతో జిల్లా ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే సంస్థగత ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయాలని వివరించారు. జనసేన పార్టీకి కార్యకర్తలు, వీర మహిళలు బలమని వివరించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.

April 5, 2026 / 06:21 PM IST

పుట్టపర్తిలో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

సత్యసాయి: జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా కలెక్టరేట్‌కు రాకుండా ‘మీ కోసం’ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చచి పేర్కొన్నారు.

April 5, 2026 / 06:20 PM IST

‘పిల్లల మొబైల్ వినియోగంపై నిఘా పెట్టాలి’

ASR: సెలవుల్లో ఇంటికి వచ్చే పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ఆదివారం సూచించారు. మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని హెచ్చరించారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని గమనించాలని తెలిపారు. పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

April 5, 2026 / 06:18 PM IST

అమరావతికి చట్టబద్ధత రంగోళ్లతో తెలుగు మహిళల మద్దతు

KRNL: రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా ఇవాళ ఎమ్మిగనూరులో తెలుగు మహిళలు ఇళ్ల ముందు రంగోలి ముగ్గులు వేసి తమ మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తుందని, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశయాలకు ప్రతీకగా రూపుదిద్దుకుంటోందన్నారు.

April 5, 2026 / 06:16 PM IST

జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన

పార్వతీపురం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, కలెక్టర్ డా. ప్రభాకరరె డ్డితో కలసి ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా తాగునీరు, డ్రైనేజ్ మరియు రహదారుల అభివృద్ధిపై కీలక సమీక్ష నిర్వహించారు.

April 5, 2026 / 06:11 PM IST

అద్దంకిలో వీధి కుక్కల హల్చల్

BPT: అద్దంకిలోని అత్తలూరు బజారులో వీధి కుక్కల హల్చల్ పెరిగింది. ద్విచక్ర వాహనదారులపై దాడులు చేసి గాయపరుస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వాహనాల వెంటపడుతూ ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

April 5, 2026 / 06:07 PM IST

స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ విజేతలకు బహుమతుల ప్రధానం

NTR: జగ్గయ్యపేటలో డీఎస్ఏ మాస్టర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్ 2026 ఉత్సాహంగా జరిగింది. ఆంధ్ర–తెలంగాణ రాష్ట్రాల క్రీడాకారులు పోటీపడి ప్రతిభ చూపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేసౌమ్య విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలు ఆరోగ్యానికి ఎంతో అవసరమని, యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.

April 5, 2026 / 06:01 PM IST

ఫిషింగ్ హార్బర్‌పై YCP తప్పుడు ప్రచారాలు: ఎంపీ

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌పై YCP దుష్ప్రచారం చేస్తోందని MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రోన్ టెస్టింగ్ కోసమే సాగర్ డిఫెన్స్ కంపెనీకి భూమి ఇచ్చిందని.. దీంతో మత్స్యకారులకే ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. వారికి అన్యాయం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. YCP తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలకు సూచించారు.

April 5, 2026 / 06:00 PM IST

విద్యార్థులకు ఉచిత శిక్షణ అభినందనీయం: ఎంపీ

ATP: అనంతపురం అభయ సీసీఎల్ క్యాంపస్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షల శిక్షణా తరగతులను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పేద విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలతో 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం అభయ, నిస్వార్థ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఎంపికైన 120 మందికి స్టడీ మెటీరియల్ అందజేశారు.

April 5, 2026 / 06:00 PM IST

పిడుగురాళ్లలో రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు

PLD: పిడుగురాళ్ల పట్టణంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ క్రీడలు మొదలయ్యాయి. పలువురు ముఖ్య అతిథులు హాజరై ఈ క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొని రాణించాలని వారు సూచించారు. ఈ టోర్నీలో వివిధ జిల్లాల నుంచి పలు జట్లు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి.

April 5, 2026 / 06:00 PM IST