ATP: అనంతపురం అభయ సీసీఎల్ క్యాంపస్లో పదవ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షల శిక్షణా తరగతులను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. పేద విద్యార్థులకు వసతి, భోజన సదుపాయాలతో 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం అభయ, నిస్వార్థ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో ఎంపికైన 120 మందికి స్టడీ మెటీరియల్ అందజేశారు.