• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పట్టుబడితే రూ.10 వేల వరకు జరిమానా: ఎస్సై

ఎన్టీఆర్: తిరువూరు ఎస్సై శాతకర్ణి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సీపీ ఆదేశాలతో ఏసీపీ సూచన మేరకు మైనర్లకు ద్విచక్ర వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వరాదన్నారు. ఎవరైనా మైనర్లు బండి నడుపుతూ పట్టుబడితే బండి సీజ్ చేసి 5000 రూపాయల నుండి 10,000 రుపాయల జరిమానా విధిస్తామని ఎస్సై హెచ్చరించారు.

April 5, 2026 / 01:18 PM IST

బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకల్లో కలెక్టర్

ప్రకాశం: స్థానిక కలెక్టరేట్‌లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తదితరులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, దళితుల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడని అన్నారు.

April 5, 2026 / 01:16 PM IST

వినుకొండలో రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశం

PLD: వినుకొండ తహశీల్దార్ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లో పరిష్కారం కాని ఇనామ్ గ్రామాలు, 22-ఏ తొలగింపు, మ్యూటేషన్స్, హౌస్ సైట్స్, రీ-సర్వే, ఐవీఆర్ఎస్, వెబ్‌ల్యాండ్ సమస్యలు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు.

April 5, 2026 / 01:15 PM IST

మంత్రి పయ్యావుల ప్రజాదర్బార్

ATP: ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అనంతపురం రామ్‌నగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు స్వీకరించి, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

April 5, 2026 / 01:15 PM IST

జగ్జీవన్ రామ్ సేవలను స్మరించిన వైసీపీ నేతలు

బాపట్ల: రేపల్లెలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. బస్టాండ్ సెంటర్‌లో విగ్రహానికి పూలమాలలు అర్పించిన సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన కీలకంగా పనిచేశారని పేర్కొన్నారు.

April 5, 2026 / 01:14 PM IST

‘మహనీయుల ఆదర్శాలతోనే సమసమాజ నిర్మాణం’

అన్నమయ్య: మదనపల్లిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహనీయుల ఆదర్శాలతో సమసమాజ నిర్మాణం సాధ్యమని పేర్కొంటూ, యువత, పోలీసు సిబ్బంది సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

April 5, 2026 / 01:10 PM IST

జాతీయ సమైక్యత శిబిరానికి విద్యార్థిని ఎంపిక

సత్యసాయి: జాతీయ సమైక్యత శిబిరానికి కదిరి STSN ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర, NSS UNIT-1 విద్యార్థిని సారిక ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ స్మిత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రం మాండ్యలోని విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న జాతీయ సమైక్యత శిబిరంలో సారిక పాల్గొననున్నట్లు వెల్లడించారు.

April 5, 2026 / 01:10 PM IST

నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

నంద్యాలలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్టోరియా రీడింగ్ రూమ్ వద్ద ఆయన విగ్రహానికి న్యాయశాఖ మంత్రి ఫరూక్, కలెక్టర్ రాజకుమారి, ఏఎస్పీ మందా జావళి, తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకుని సామాజిక న్యాయానికి చేసిన కృషిని కొనియాడారు.

April 5, 2026 / 01:10 PM IST

రాజమండ్రిలో ‘మన రాజధాని – మన అమరావతి’

E.G: రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్‌లో చట్టబద్ధత బిల్లును స్వాగతిస్తూ ఆదివారం రాజమండ్రిలోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ‘మన రాజధాని – మన అమరావతి’ అంటూ తెలుగు మహిళలు రంగవల్లులు వేశారు. వాటిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి తిలకించారు. ప్రజా రాజధానికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.

April 5, 2026 / 01:10 PM IST

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే

కోనసీమ: పేదరికంలో పుట్టి, రాజ్యాంగ రచనా సభ్యునిగా, ఉప ప్రధానిగా దేశానికి సేవలందించిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ అని కొత్తకోట ఎమ్మెల్యే బండారు సంత్యానందరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్మిక శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

April 5, 2026 / 01:00 PM IST

ఆదోనిలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

KRNL: ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ సర్కిల్ వద్ద DHPS ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొని, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు వీరేష్ మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, దళితుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.

April 5, 2026 / 01:00 PM IST

24 ఏళ్లకే జడ్జిగా బొనిగే లిఖి ప్రకాశ్

E.g: గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన బొనిగే లిఖి ప్రకాశ్ 24 ఏళ్లకే సివిల్ జడ్జిగా ఎంపికై రికార్డు సృష్టించారు. తండ్రి వెంకట్రావు మేజిస్ట్రేట్ కాగా, తల్లి కోరిక మేరకు కష్టపడి ఈ విజయం సాధించినట్లు ప్రకాశ్ తెలిపారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ చాటి చిరుప్రాయంలోనే న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 5, 2026 / 12:45 PM IST

కల్వర్టును పరిశీలించిన పల్లె రఘునాథరెడ్డి

సత్యసాయి: బుక్కపట్నం మండలం రాసింపల్లి వద్ద సిద్ధరాంపురంలో చెరువుకు వెళ్లే కల్వర్టును మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు సాఫీగా బయటకు వెళ్లేలా అక్కడ కొత్త కల్వర్టును నిర్మించాలని మండల నాయకులు ఆయనకు సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన మాజీ మంత్రి, కల్వర్టు నిర్మాణానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

April 5, 2026 / 12:42 PM IST

వడ్డే ఓబన్నను గౌరవించుకోవాలి: ఎంపీ అంబిక

అనంతపురం పీటీసీ సమీపంలో వడ్డే ఓబన్న విగ్రహ ఏర్పాటుకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భూమి పూజ చేశారు. వడ్డే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర పోరాట వీరుడు ఓబన్న విగ్రహాన్ని నగరంలో ప్రతిష్టించడం సంతోషకరమన్నారు. ఆయన ఆశయాలను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

April 5, 2026 / 12:41 PM IST

ఆదోనిలో YSR కాంగ్రెస్ పార్టీలోకి దంపతుల చేరిక

KRNL: ఆదోని మండలం మండిగిరి పంచాయతీకి చెందిన కురువ వాసుదేవ్, అన్నపూర్ణ దంపతులు ఇవాళ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చలేకపోయారని వారు విమర్శించారు. మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు.

April 5, 2026 / 12:40 PM IST