• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రాయలసీమకు YCP చేసిందేమీ లేదు: మంత్రి

KRNL: రాయలసీమను YCP రాజకీయం కోసమే వాడుకుందని శుక్రవారం మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమకు YCP ఏం చేసిందో చెప్పాలన్నారు. ఆ ప్రాంతంపై ప్రేమ ఉంటే.. ఎంత ఖర్చు పెట్టారో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సీమలో హార్టికల్చర్ హబ్ పెడతామని చెప్పామని.. చేస్తామని స్పష్టం చేశారు. YCP మొసలి కన్నీళ్లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

April 11, 2026 / 08:14 AM IST

శ్రీవారి వైశాఖమాస కళ్యాణోత్సవాలు

ELR: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు.

April 11, 2026 / 08:12 AM IST

జనాభా గణనను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్

W.G: భీమవరం మున్సిపల్ కార్యాలయంలో ‘భారతదేశ జనాభా గణన 2027’ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ నాగరాణి శుక్రవారం పర్యవేక్షించారు. మే 1 నుంచి గృహాల జాబితా నమోదు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనాభా గణన 2 దశల్లో జరుగుతుందని, ప్రతీ ఇంటి డేటాను సమగ్రంగా సేకరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

April 11, 2026 / 08:11 AM IST

మీ ముందు కూర్చుంటేనే ప్రజా సేవ చేసినట్లా: DCCB ఛైర్మన్

VZM: సీఎంతో జరిగిన రివ్యూ మీటింగ్‌కి వెళ్లి ZP సమావేశానికి హాజరు కాలేకపోతే దానిని ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున మండిపడ్డారు. శుక్రవారం జిల్లా TDP కార్యాలయంలో మాట్లాడుతూ.. కూటమి MLAలు మీ ముందు కూర్చుంటేనే ప్రజా సేవ చేసినట్లా అని శ్రీనివాసరావును మీడియా ముఖంగా ప్రశ్నించారు.

April 11, 2026 / 08:09 AM IST

ప్రొద్దుటూరులో మోటార్ సైకిల్ దొంగ అరెస్ట్..!

KDP: ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు శుక్రవారం మోటార్ సైకిల్ దొంగను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో మోటార్ సైకిళ్ల చోరీపై విచారణ చేపట్టి, స్థానిక నడింపల్లె వీధికి చెందిన షేక్ మొయినుద్దీన్‌ను అరెస్ట్ చేసినట్లు CI కొండారెడ్డి తెలిపారు. ఈ మేరకు SIలు శ్రీనివాసులు, మధుసూదన్ రెడ్డిలను జిల్లా SP అభినందించారు.

April 11, 2026 / 08:09 AM IST

వార్షిక రుణ ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ

ATP: అనంతపురం టీటీడీసీ భవనంలో సెర్ప్ సీఈఓ ఆదేశాల మేరకు వార్షిక రుణ, జీవనోపాధుల ప్రణాళికపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ టి.శైలజ పాల్గొని మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రణాళికలో 50 శాతం జీవనోపాధులు వచ్చేలా చూడాలని సిబ్బందికి సూచించారు. సభ్యుల అవసరాలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.

April 11, 2026 / 08:03 AM IST

తాడిపూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

తూ.గో: తాళ్లపూడి మండలం తాడిపూడి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు నామా వెంకట సుబ్బారావు శుక్రవారం ప్రారంభించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రుచిత పాల్గొన్నారు.

April 11, 2026 / 08:03 AM IST

KGBV ప్రవేశాల దరఖాస్తుల గడువు పొడిగింపు

KDP: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. రాష్ట్రవ్యాప్తంగా 352 KGBVల్లో 6,11 తరగతుల్లో ప్రవేశాలు, 7-10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అన్ని KGBVల్లో కలిపి 32,079 సీట్లు ఉండగా.. ఇప్పటివరకు 69,362 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

April 11, 2026 / 08:03 AM IST

‘క్షయ, మలేరియా జ్వరాలు సకాలంలో గుర్తించాలి’

PPM: క్షయ, మలేరియా జ్వరాలు సకాలంలో గుర్తించి, వ్యాప్తి చెందకుండా నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. జిల్లా క్షయ విభాగపు సిబ్బంది, మలేరియా సబ్ యూనిట్ అధికారులతో శుక్రవారం ఆరోగ్య కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సూర్య కౌశిక్ పాల్గొన్నారు.

April 11, 2026 / 07:49 AM IST

‘పెంచిన పందులను తక్షణమే తగ్గించాలి’

కృష్ణా: పన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సీపీఎం కృష్ణా జిల్లా కమిటీ సభ్యుడు ఆర్‌.సీపీ రెడ్డి గుడివాడలో నిన్న విమర్శించారు. 5% రిబేటు అని చెబుతూనే, ఏటా 15% పన్ను పెంచడం ప్రజలపై మోయలేని భారమని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. పెంచిన పన్నులను తక్షణమే తగ్గించాలన్నారు.

April 11, 2026 / 07:46 AM IST

గుంటూరు జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

GNTR: గుంటూరు జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన పీజీఆర్ఎస్ దరఖాస్తులను 12 గంటల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. డయేరియా నివారణ చర్యలు, శుద్ధి త్రాగునీటి సరఫరా, జలవనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

April 11, 2026 / 07:41 AM IST

జిల్లా చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్‌ ఎంపిక

KRNL: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్‌గా న్యాయవాది ఎం.శివ రామచంద్ర రావు ఎంపికైనట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ప్రధాన న్యాయమూర్తి జి.కబర్థి తెలిపారు. శుక్రవారం న్యాయ సేవాసదన్‌లో కబర్థి, న్యాయ సేవాధికార కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి నియమాకం పత్రాన్ని ఆయనకు అందజేశారు. అనంతరం ఆయనకు వారు అభినందనలు తెలిపారు.

April 11, 2026 / 07:39 AM IST

‘బ్రహ్మంగారిమఠం పరిశుభ్రంగా ఉండాలి’

KDP: ఈనెల 23 నుంచి 28వ తేదీ వరకు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు జరగనున్నాయని పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయ మాడ వీధులు, ఆలయ పరిసరాలను ఆయన శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని షాపుల యజమానులకు సూచించారు. అదేవిధంగా మాడవీధులను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

April 11, 2026 / 07:34 AM IST

ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

ప్రకాశం: ఒంగోలులో ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్థానిక మున్సిపల్ హైస్కూల్‌లో ఈ నెల 11 నుంచి 15 వరకు స్పాట్ వాల్యుయేషన్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యాంప్ అధికారి పి.వి. రేణుక తెలిపారు. ఈ క్యాంప్‌లో పరీక్షా పత్రాల మూల్యాంకనం వేగవంతంగా చేపట్టి, ఫలితాలను త్వరగా ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

April 11, 2026 / 07:32 AM IST

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

ప్రకాశం: తాళ్లూరు మండలంలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండగా తల్లి శుక్రవారం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. జరిగిన విషయం వెలుగులోకి రావడంతో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 11, 2026 / 07:29 AM IST