PPM: 1944 ముంబై నౌకా ప్రమాదంలో అమరులైన 66 మంది అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ జాతీయ సంతాప దినాలు ప్రారంభించింది. ఏప్రిల్14 నుంచి 21 వరకు వారంరోజులపాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ ఫైర్ ఆఫీసర్ ఆరిక సింహాచలం తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు,పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్‌లలో అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
SKLM: అంబేద్కర్ స్పూర్తితో హక్కులు కోసం పోరాడాలని CITU జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం డా.బి. ఆర్.అంబేద్కర్ జయంతి సందర్బంగా రణస్థలం M పతివాడపాలెంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేద్కర్ అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన కృషి చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు.
VSP: సింహాచలం వరాహా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు.
CTR: సదుంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లి, కార్వేటి నగరం మండలంలోని RKVB పేట నుంచి కోళ్ల రవాణా నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో ఈ ప్రాంతాలలో కోళ్లకు బర్డ్ ప్లూ సోకాయి. ఈ నేపథ్యంలో రెండు నెలలపాటు ఈ ప్రాంతాలలో నమూనాలు తీసి టెస్టింగ్‌కు పంపనున్నారు. అన్నింటిలో నెగిటివ్ వస్తేనే కోళ్ల పెంపకాని అనుమతి ఇస్తారు.
E.G: కోరుకొండలో బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇవాళ ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతిని భారతదేశంలో ‘సమానత్వ దినోత్సవం’గా జరుపుకుంటారన్నారు. సామాజిక న్యాయం, మహిళా హక్కులు & కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషికి ఈ రోజు చిహ్నంగా నిలుస్తుందన్నారు.
ELR: చింతలపూడిలో మంగళవారం అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేవలం రాజ్యాంగ రచయితగా మాత్రమే కాకుండా, విద్యాభ్యాసంలోను, దళితుల సంక్షేమం కోసం పాటుపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ATP: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు, దళిత సోదరులతో కలిసి కేక్ కట్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
GNTR: భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలోని 8వ డివిజన్ క్రిస్టియన్ పేట పార్క్ రోడ్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం, చిత్రపటానికి వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
E.G: ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో 135వ బి.ఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ ఎం.రామకృష్ణ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని వారు కొనియాడారు.
BPT: భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చీరాల ముక్కోణపు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, చీరాల ఎమ్మెల్యే మద్దలూరు మాలకొండయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ.. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
NLR: అంబేద్కర్ జయంతి సందర్భంగా కంపసముద్రానికి చెందిన తెలుగు ఉపాధ్యాయుడు శివశంకర్ అంబేద్కర్ ఫొటోను దారంతో తయారు చేశారు. ఆయన ఆకులపై పలు చిత్రాలను, తాళపత్ర గ్రంథాలను రచించే కళతో పాటు దారంతో చిత్రాలు తయారు చేసే ఏకైక కళాకారుడు కూడా కావడం విశేషం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు.
SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి పోలాకి మండలం పోలాకి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి జన్మదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. నియోజకవర్గం ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్యే ప్రార్థించారు.
KRNL: అంబేడ్కర్ ఆశయాలను అనుసరిస్తూ సామాజిక న్యాయం సాధనలో ముందుకు సాగాలని ఆలూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు. ఇవాళ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆలూరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. దేవుడు జన్మనిస్తే.. అంబేడ్కర్ జీవించే హక్కును కల్పించారని స్పష్టం చేశారు. అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
VZM: బొబ్బిలి నియోజకవర్గం, బాడంగి మండలం, ఆనవరం గ్రామానికి చెందిన అలమండ మోహనరావు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందారు.. MGNREGS తరఫున వారి కుటుంబానికి రూ. 5,00,000/- ఎక్స్ గ్రేషియా మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన బొబ్బిలి కోటలో మోహన్ రావు భార్యకు ఆ చెక్కును అందజేశారు.
CTR: సరైన గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న టమాట రైతులకు ప్రస్తుతం పెరుగుతున్న ధరలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. పలమనేరులో సోమవారం టమాటా బాక్సు (14 కిలోలు) ధర రూ.400 పలికింది. నాలుగు రోజుల కిందట బాక్సు రూ.200 ఉండగా రోజుకి యాభై చొప్పున ధర పెరుగుతూ వస్తోంది. వేసవి ప్రభావంతో పంట దిగుబడులు తగ్గడంతో ధర పెరుగుతోందని మార్కెట్ వర్గాలు అంచనా వస్తున్నాయి.