• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరులో ఇద్దరు ఆత్మహత్య

KDP: ప్రొద్దుటూరు మండలం లింగాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ గ్రామానికి చెందిన రామాంజనేయులు, ప్రమీల నెల రోజుల క్రితం లింగాపురంలో ఇల్లు బాడుగకు తీసుకున్నారు. శనివారం ఇంట్లోనే వారి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

April 11, 2026 / 09:30 PM IST

దాడి కేసులో నిందితుని అరెస్టు

PLD: రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామ పరిసరాల్లో మహిళపై దాడి చేసి ఆభరణాలు దోచుకున్న కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. ముప్పాళ్లకు చెందిన చైతన్యపై మార్చి 16 రాత్రి దాడి జరగగా, బంగారం, సిల్వర్ రింగ్స్ దోచుకెళ్లినట్లు వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకుని నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

April 11, 2026 / 09:26 PM IST

ప్రాణం ఖరీదు రూ.26 కోట్లు

GNTR: తెనాలికి చెందిన చిన్నారి అశ్వర్త్ గురుదత్త అరుదైన DMD వ్యాధితో పోరాడుతున్నాడు. ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు రూ.26 కోట్లు అని వైద్యులు తెలిపారు. సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు క్రౌడ్ ఫండింగ్స్‌ను ఆశ్రయించి ప్రజలు, ప్రభుత్వాన్ని సహాయం కోరుతున్నారు. సాయం చేయదలచిన వారు బాబు తండ్రి హరీష్ కుమార్ నంబర్ 9700365341ను సంప్రదించగలరు.

April 11, 2026 / 09:01 PM IST

జాబ్ మేళా పోస్టర్ల ఆవిష్కరణ

TPT: శ్రీకాళహస్తిలో ఈనెల 15న జరగనున్న జాబ్ మేళా పోస్టర్లను జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు ఆవిష్కరించారు. జేఎన్టీయూఏ–స్కిట్‌లో నిర్వహించే ఈ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొని 2000కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 11, 2026 / 09:00 PM IST

మద్దిలేటి స్వామి సన్నిధిలో MLA కోట్ల పూజలు

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్‌.ఎస్‌. రంగాపురంలో వెలసిన శ్రీ ఘన మద్దిలేటి స్వామి దేవస్థానాన్ని శనివారం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి జన్మదిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

April 11, 2026 / 09:00 PM IST

హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

ELR: కొయ్యలగూడెం తారకరామ నగర్ అత్త పోల మంగమ్మను నరికి చంపిన అల్లుడు కేదారి పుల్లయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం అచ్యుతాపురం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే అత్తని హత్య చేశాడని పోలీసులు వివరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వివరించారు.

April 11, 2026 / 09:00 PM IST

అక్రమ కట్టడాల తొలగింపులో అంతరాయం

NLR: బుచ్చి పట్టణం పెద్దూరులో అనుమతులు లేకుండా గుడిని ఏర్పాటు చేస్తున్న అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తుండటంతో సుమతి అనే మహిళ అడ్డుకుంది. తనను JCBతో కొట్టిన తర్వాతే ధ్వంసం చేయాలని బైఠాయించింది. గ్రామానికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో గుడిని ఏర్పాటు చేస్తున్నామని… రాత్రిపూట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించింది.

April 11, 2026 / 08:56 PM IST

‘డ్రగ్స్ వద్దు బ్రో’ పోస్టర్‌ను ఆవిష్కరించిన సినీనటి

SKLM: పట్టణంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి శనివారం సినీనటి నేహా శెట్టి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె చేతుల మీదుగా జిల్లా పోలీసు శాఖ ‘డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం, నారి శక్తి’ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌తో కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.

April 11, 2026 / 08:51 PM IST

అర్ధవీడులో బాలుడు అదృశ్యం

ప్రకాశం: అర్ధవీడు మండలానికి చెందిన బైనముక్కల రాకేష్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. శుక్రవారం స్కూలుకు వెళ్లి ఇంటికి వచ్చిన అనంతరం అతను కనిపించకుండా పోయినట్లు బాలుడి తల్లి తెలిపింది. ఈ ఘటనపై ఇప్పటికే అర్ధవీడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న బాలుడిని గుర్తిస్తే దయచేసి 7032669045 నంబర్‌కు సమాచారం అందించాలని బాలుడి తల్లి విజ్ఞప్తి చేసింది.

April 11, 2026 / 08:46 PM IST

కోర్టును మభ్యపెట్టడంతో నిందితుడికి రిమాండ్

VZM: 2024 ఎస్.కోట పోలీసు స్టేషన్‌లో గంజాయి కేసులో రెండో ముద్దాయి నక్క వెంకటరమణపై నమోదైన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ నారాయణమూర్తి శనివారం తెలిపారు. నాసిక్ చెందిన జావేద్‌కు బెయిల్ నిమిత్తం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పత్రాలు పరిశీలించగా తప్పుడు పత్రాలుగా తేల్చడంతో కేసు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.

April 11, 2026 / 08:43 PM IST

ఎర్రగుంట్లపాడులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

GNTR: ఫిరంగిపురం మండలం ఎర్రగుంట్లపాడు గ్రామ పరిధిలోని NSP కాల్వ లాకుల వద్ద శనివారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం వెలుగులోకి వచ్చింది. మృతుడు సుమారు 40-45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని ఎడమ చేతిపై “ఫరోన్ ఇమాన్ షా” అనే పచ్చబొట్టు ఉంది. మృతుని వివరాలు తెలిసిన వారు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

April 11, 2026 / 08:32 PM IST

మైసూరు రైలుకు కొత్తవలసలో హాల్ట్

VZM: రైలు నంబరు 06251/52 మైసూరు న్యూ జలపాయిగురి జంక్షన్ మైసూరు మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం శనివారం తెలిపారు. ఈ రైలు 17, 24 తేదీల్లో మైసూరులో ప్రతి శుక్రవారం 16.40 బయలుదేరి శనివారం మధ్యాహ్నం 15.10 కొత్తవలసకు వస్తుందన్నారు. న్యూ జలపాయిగురి జంక్షన్‌లో 20, 27 ప్రతి సోమవారం 16.45 బయలుదేరి మంగళవారం 16.30కు వస్తుందన్నారు.

April 11, 2026 / 08:31 PM IST

పుంగనూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణంలోని స్థానిక BMS క్లబ్ ఆవరణలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి. శివ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు.

April 11, 2026 / 08:31 PM IST

విశాఖ రైల్వే జోన్‌పై అమర్‌నాథ్ ఫైర్

VSP: ఉత్తరాంధ్ర హక్కుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. శనివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ద్రోహం చేశారని విమర్శించారు. కేకే లైన్‌ను ఒడిశాకు మళ్లించడంపై మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు.

April 11, 2026 / 08:30 PM IST

కలుదేవకుంటలో పట్ట పగలే దొంగలు హల్‌చల్

KRNL: మంత్రాలయం మండల పరిధిలోని కలుదేవకుంట గ్రామంలో పట్ట పగలే దొంగలు ఓ ఇంట్లో రూ.50 వేల నగదును చోరీ చేసినట్లు బాధితుడు జగదీష్ తెలిపారు. శనివారం ఉదయం తన అన్న కుమారుడికి సంబంధం మాట్లాడేందుకు గ్రామంలోనే తన అన్న ఇంటికి వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగదును దోచుకున్నట్లు బాధితుడు తెలిపాడు.

April 11, 2026 / 08:30 PM IST