గుంటూరు: శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఈనెల 24వ తేదీన ఉచితంగా కాలేయ పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి అధినేత, ఆయుర్వేద నిపుణులు కొండా వెంక టేశ్వర్లు తెలిపారు. ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించి నిపుణులైన వైద్యుల సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు.