కృష్ణ: అదనపు ఓటీ నిర్మించి ముంపు సమస్య పరిష్కరించాలని భావదేవరపల్లి రైతులు కోరారు. సోమవారం నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ముంపు సమస్యను అవనిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ పరిశీలించారు. వక్కపట్లవారిపాలెం డ్రైనేజీ, భావదేవరపల్లి మెయిన్ డ్రైనేజీల ముంపు మళ్లించేందుకు సెంట్రల్ ఛానల్ నాలుగో నంబర్ పంట కాలువ కింద మరొక యూటీ నిర్మించాలని రైతులు కోరారు.