ATP: తాడిపత్రిలో గంజాయిపై యుద్ధం ప్రకటిస్తున్నానని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాడిపత్రిలో యువత ఎక్కువగా గంజాయికి బానిసై తప్పుదోవ పడుతోందన్నారు. గంజాయి విక్రయదారులపై పోలీసుల సహకారంతో పీడియాక్ట్ పెడతామని హెచ్చరించారు. తాడిపత్రి ప్రజలందరం ఏకమై గంజాయిని తరిమికొడదామని ఆయన పిలుపునిచ్చారు.