ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆమె కారులో శుక్రవారం ఒంగోలుకు బయల్దేరగా మార్గమధ్యంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. సంతమాగులూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కారు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో విజయమ్మ కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు వెనక భాగం కాస్త దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో విజయమ్మకు, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు తెలిపారు. దీంతో ఆమె అదే కారులో ఒంగోలుకు బయల్దేరి వెళ్లారు. ప్రమాదం విషయం తెలుసుకున్న తనయుడు సీఎం జగన్, కూతురు వైఎస్ షర్మిలలు ఆమెకు ఫోన్ చేసి వివరాలడిగి తెలుసుకున్నారు.