»Ttd Governing Body Key Decisions Of Ttd Governing Council Good News For Them
TTD Governing body : టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు..వారికి గుడ్న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్బంగా శానిటరీ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. తిరుపతి నగర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు తెలిపింది.
టీటీడీ (TTD) పాలక మండలి (Governing body) నేడు ప్రత్యేక సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి (Alipiri) వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ యాగం చేయాలని నిర్ణయించుకుంది. భక్తులు తమ పేరుపై ఈ యాగం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ యాగం నిరంతరాయంగా సాగాలని తెలిపింది. టీటీడీలో శానిటరీ కార్మికుల జీతాన్ని రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పైగా పెంచేందుకు పాలక మండలి ఆమోదం తెలిపింది.
శ్రీలక్ష్మి మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులకు ప్రతి ఏడాది 3 శాతం జీతాలు పెంచనున్నట్లు తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 2 సంవత్సరాలకు 3 శాతం జీతాన్ని పెంచనున్నట్లు వెల్లడించింది. రూ.18 కోట్లతో నారాయణగిరి వద్ద భక్తుల కోసం కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని, పాపవినాశనం వరకూ రూ.40 కోట్లతో 4 లైన్ల రోడ్డు నిర్మించాలని, వరాహ అతిథి గృహం వద్ద రూ.10.50 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని టీటీడీ బోర్టు నిర్ణయాలు తీసుకుంది.
అలాగే తిరుపతి పట్టణంలో (Tirupathi City) పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కూడా సిద్దమైంది. తిరుపతి నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు తుడాతో భాగస్వామ్యం ఏర్పరుచుకునేందుకు సమాయత్తమైంది. టీటీడీ (TTD) మొత్తం బడ్జెట్లో 1 శాతం తిరుపతి అభివృద్ధికి (Tirupathi Developement) ఇవ్వాలని, చెర్లోపల్లిలో మంగాపురం రోడ్డు విస్తరణకు రూ.25 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) కళ్యాణ మండపాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకూ భక్తి పాటలే ఉండేలా చర్యలు తీసుకుంది. అలాగే టీటీడీ (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ (Garimella Balakrishna Prasad)కు పద్మశ్రీ (Padma sri) ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నట్లు పాలక మండలి (TTD Governing Body) తీర్మానించింది.