తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ (CM Jagan) వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
CM Jagan: తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచిని ప్రజలకు తెలియజేయాలని సీఎం జగన్ వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన వైసీపీ విసృతస్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మళ్లీ జగనే ఎందుకు సీఎం కావాలో చెప్పే కార్యక్రమమే ‘వై ఏపీ నీడ్స్ జగన్’ ప్రోగ్రాం అని వివరించారు. గ్రామస్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన మంచి గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు మంచి చేసేందుకు జగన్ కావాలని అన్నారు. నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపడదామని పిలుపునిచ్చారు.
మార్చిలో అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అవుదావని వైసీపీ శ్రేణులకు సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. రోజు 3 మీటింగ్స్ ఉంటాయని.. బస్సు యాత్ర బృందంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఉంటారని వివరించారు. ఇది సామాజిక న్యాయ యాత్ర అని సీఎం జగన్ చెబుతున్నారు.
తమ ప్రభుత్వంలో పేదవారికి జరిగిన మంచిన వివరించే యాత్ర అని తెలిపారు. ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని వివరించారు. వచ్చే ఎన్నికలు పేదవారికి, పెత్తందార్లకు మధ్య జరగబోయే యుద్ధంగా అభివర్ణించారు. జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ పెంచుతున్నామని చెప్పారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తామని ప్రకటించారు. జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత ఉంటుందని పేర్కొన్నారు. జనవరి 20 నుంచి 30వ వరకు వైఎస్ఆర్ ఆసరా ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయని పేర్కొన్నారు. తమ పొత్తు ప్రజలతోనేనని.. దేవుడిని, ప్రజలనే నమ్ముకున్నానని జగన్ స్పష్టంచేశారు. టీడీపీ- జనసేన పొత్తుల గురించి ఇండైరెక్టుగా మాట్లాడారు.