ఇటీవల విచారణ చేపట్టిన విజయవాడలోని ఏసీబీ కోర్టు (ACB Court)తీర్పును నేటికి వాయిదా వేసింది. అంగళ్లు కేసులో ఇప్పటికే పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో.. చంద్రబాబుకు ఈ కేసులో కచ్చితంగా బెయిల్ వస్తుందని టీడీపీ (TDP) శ్రేణులు భావించాయి. అయితే, వారి అంచనాలకు విరుద్ధంగా హైకోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో సుప్రీంకోర్టు(Supreme Court)ను టీడీపీ ఆశ్రయించే అవకాశం ఉంది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ (Quash Petition) పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది.