Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో 2.0 వెర్షన్ స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు ఫన్‌డేతో స్టార్ట్అయిన సండే ఎపిసోడ్ ఈసారి అందరు షాక్ అయ్యేలా ఎలిమినేషన్స్‌తో స్టార్ట్ అయ్యింది. ఎప్పుడు ఒక ఎలిమినేషన్ ఉంటుంది. కానీ ఈ వారం రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో మొదటిగా శుభశ్రీ బిఎలిమినేట్ అయ్యింది. ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లందరిని నాగార్జున యాక్టివిటీ ఏరియాలోకి రమ్మన్నారు. తర్వాత లైట్స్ అన్ని ఆపేసి శుభశ్రీని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. గౌతమ్‌కు చేసిన త్యాగం వల్లే శుభశ్రీ ఎలిమినేట్ అయ్యిందని గౌతమ్ ఫీల్ చాాలా ఫీల్ అయ్యాడు. శుభశ్రీని తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందా అని కూడా నాగార్జునను అడిగాడు.
శుభశ్రీ వెళ్లిపోయిన కొంతసమయం తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్‌కి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిపాడు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లలో చివరికి అమర్దీప్, గౌతమ్ మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోవడానికి రెడీగా ఉన్నారు. చివరికి గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున చెప్పాడు. దీంతో గౌతమ్ వాళ్ల అమ్మ రాసిన ఉత్తరంతో ఇంటి నుంచి స్టేజ్‌పైకి వచ్చేశాడు. హౌస్‌లో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా పడని యావర్ మాత్రమే కరెక్ట్ ఉన్నాడు. మిగతా వాళ్లంతా ఫేక్ గేమ్ ఆడుతున్నారని.. గౌతమ్ చెప్పడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇలా స్టేజ్ మీద అందరి గురించి చెప్పి వెళ్లిపోతుంటే.. నాగార్జున ఆ లెటర్ తీసుకుని.. నీ ఆట బాగుంది నీకు ఇంకో అవకాశం ఇవ్వాలనుకుంటున్నా అని తెలిపి గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌లో ఉంచుతాడు. ఇలా ఊహించని గౌతమ్.. సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్ బాగుందని కామెంట్ చేశాడు.