»Tdp Chief Chandrababu Naidu Recommend This Seat To Pk
Pawan ఇక్కడి నుంచి పోటీ చేయండి.. జనసేనానికి చంద్రబాబు సూచన
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ చీఫ్ చంద్రబాబు కోరారని తెలిసింది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్.. ఈ సారి పోటీ చేసే స్థానాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలని.. అందుకే తిరుపతి పేరు సజెస్ట్ చేశారని తెలిసింది.
TDP Chief Chandrababu Naidu Recommend This Seat To PK?
Chandrababu: వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన పొత్తు ఖరారైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబును (Chandrababu) అరెస్ట్ చేయడంతో జనసేనాని నిర్ణయం తీసుకున్నారు. జైలు వేదికగా ప్రకటన కూడా చేశారు. ముందు బీజేపీ (BJP) కలిసి వస్తోందని.. తర్వాత వచ్చిన ఫర్లేదు అన్నట్టు ప్రవర్తించారు. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుందనే అంశం చర్చకు వస్తోంది. దీంతోపాటు జనసేనాని పోటీ చేసే స్థానంపై కూడా ఉత్కంఠ నెలకొంది.
ఓడిపోయిన పవన్
గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓడిపోయారు. ఈ సారి తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్‌ను చంద్రబాబు (Chandrababu) కోరారని కొన్ని కథనాలు వస్తున్నాయి. చంద్రబాబు (Chandrababu) రిక్వెస్ట్ వెనక ప్రత్యేక కారణం కూడా ఉంది. తిరుపతిలో కాపు కమ్యూనిటీకి చెందిన బలిజలు ఎక్కువ మంది ఉంటారు. ఇది పవన్‌కు అనుకూలంగా మారుతుందని చంద్రబాబు (Chandrababu) అంచనా వేశారు. 2009లో పవన్ సోదరుడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో పాలకొల్లు నుంచి బరిలోకి దిగి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
సేఫ్ సీటు
గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ ఓడిపోయారు. ఇప్పుడు అయినా సేఫ్ సీటు నుంచి బరిలోకి దిగాలని చంద్రబాబు (Chandrababu) సూచించారని తెలిసింది. పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే.. చిత్తూరు జిల్లా నుంచి పోటీ చేసే టీడీపీ/ జనసేన నేతలకు కలిసి వస్తోందని చంద్రబాబు (Chandrababu) భావించారు. రాయలసీమలో కడపతోపాటు చిత్తూరులో వైసీపీ బలంగా ఉంది. పవన్ పోటీ చేయడంతో వారి ప్రాబల్యం తగ్గించొచ్చు అని చంద్రబాబు వ్యుహా రచన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుప్పం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి.. ఇద్దరు ఒక జిల్లా నుంచి పోటీ చేసినట్టు అవుతోంది.
తప్పని ప్రతిఘటన
టీడీపీ నుంచి తిరుపతిలో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ, వుక విజయ్ కుమార్, మాజీ టీడీపీ బోర్డు సభ్యుడు ఓవీ రమణ సీటును ఆశిస్తున్నారు. జనసేన నుంచి డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్, కిరణ్ రాయల్ సీటు కోసం చూస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు చెప్పినట్టు పవన్ బరిలోకి దిగితే వీరి నుంచి ప్రతిఘటన ఎదురయ్యే ప్రమాదం ఉంది.