తనకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడంలో వర్మను మించిన వారు లేరు. వివాదాస్పద కామెంట్స్ చేయడంలో.. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ టాప్ ప్లేస్ లోనే ఉంటారు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి వాహనాన్ని పందుల వాహనం అంటూ ట్వీట్ చేసి మరోసారి ట్వీట్ హీట్ పెంచాడు. వివాదంలోకి స్వామి వివేకానందని కూడా లాగారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి కొండగట్టులో ప్రత్యేక పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కాషాయం లుంగీ, కండువా కప్పుకున్న పవన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలు వాడుకుంటూ వర్మ ట్వీట్టర్ లో రెచ్చిపోయాడు.
ఆ రోజుల్లో రామారావు గారు "చైతన్య రథం" మీద తిరిగితే, మీరు”పంది బస్సు” మీద తిరుగుతున్నారు అంటున్న తప్పుడు నా కొడుకులందర్నీ జనసేనలతో బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి @PawanKalyan గారూ.ఇది మీ ఫ్యాన్ గా నా విన్నపం🙏 pic.twitter.com/9LRcCrt4Ux
మరో ట్వీట్లో హిట్లర్, స్వామివివేకానంద ఇద్దరు పవన్ కళ్యాణ్ కాళ్లను నొక్కుతారు.. అదీ పవన్ స్టార్ పవర్ అని పోస్ట్ వేశాడు. అంతేకాదు, వారాహి వాహనాన్ని సాక్రెడ్ పిగ్ (పవిత్రమైన పంది) అని కామెంట్ చేశాడు. పవన్, వివేకానంద ఫోటోలను జత చేసి బలవంతుడైన వివేకానందుడు అని ఇంకో పోస్ట్ చేశాడు. పవన్ ను ట్యాగ్ చేస్తూ స్వామి వివేకానందను వివాదంలోకి లాగడంపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు.
వాటితో పాటే న్టీఆర్, పవన్ ఫోటోలను కూడా జత చేసి జనసైనికులను కవ్వించాడు. ‘‘ఆ రోజుల్లో రామారావు గారు చైతన్య రథం మీద తిరిగితే, మీరు పంది బస్సు మీద తిరుగుతున్నారు అంటూ రెచ్చగొట్టాడు. తప్పుడు వాళ్లని బస్సు టైర్లకింద తొక్కించేయండి సార్! ఒకవేళ అలా చేయడం లీగల్ గా కుదరదనుకుంటే కనీసం కేసులన్నా పెట్టించండి..’ అంటూ పవన్ కళ్యాణ్ మీద ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఇది పవన్ ఫ్యాన్ గా తన విన్నపం అని చెప్పాడు. ‘‘గుడిలో ఉంటే అది వారాహి.. రోడ్డు మీద ఉంటే అది పంది. ‘పీ’ (ఇన్ డైరెక్ట్ గా పవన్ ని ట్యాగ్ చేస్తూ) తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం ఆ దేవతని దారుణంగా అవమానించినట్టే. బయట కొన్ని కుక్కలు మొరుగుతున్నాయి. వెంటనే వాళ్ళ నోర్లు మూయించండి. లేకపోతే మన పవిత్ర వారాహిని ఒక పంది బస్సుగా ముద్ర వేస్తారు’’ అని మరో ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ‘‘డియర్ జనసైనికులారా దయచేసి #PandhiBassuVaarahi హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ అవ్వకుండా చూసుకోండి’’ అంటూ మరో ట్వీట్ చేశాడు. వర్మ ట్వీట్స్ పై పవన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.