ఏపీ హైకోర్టులో రామోజీరావు(Ramoji Rao), శైలజాకిరణ్ క్వాష్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది. గాదిరెడ్డి జగన్నాథ రెడ్డి కుమారుడు యూరిరెడ్డి(Yuri Reddy) మార్గదర్శిలో తన పేరిట ఉన్న వాటాలను ఫోర్జరీ సంతకాలతో శైలజ పేరు మీదకు మార్చుకున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. దీంతో రామోజీరావును ఏ1గా, శైలజా కిరణ్ ను ఏ2గా పేర్కొంటూ సీఐడీ (CID) విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రామోజీరావు, శైలజాకిరణ్ (Sailajakiran) ఉన్నత స్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. రామోజీరావు, శైలజా కిరణ్ తరఫున సిద్ధార్థ లూథ్రా (Siddhartha Luthra) వాదనలు వినిపించారు.
రేపటి వరకు ఈ కేసులో రామోజీరావుపై కఠిన చర్యలు తీసుకోబమంటూ సీఐడీ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో బుధవారం వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది. 1962లో మార్గదర్శి (Margadarshi) స్థాపించిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5,000 పెట్టుబడిగా పెట్టగా, 288 షేర్లు లభించాయన్నది యూరిరెడ్డి వాదనగా ఉంది. తన తండ్రి 1985లో చనిపోయారని, తన తండ్రికి మార్గదర్శిలో వాటాలున్నట్టు తెలిసి, అడిగేందుకు సోరుడు మార్టిన్ రెడ్డితో వెళ్లగా, రామోజీరావు తుపాకీతో బెదిరించి తమ నుంచి బలవంతంగా వాటాలు రాయించుకున్నట్టు ఆరోపిస్తున్నారు. ఈ వాటాలు 2016లో శైలజాకిరణ్ పేరిట బదిలీ అయినట్టు చెబుతున్నారు. సమగ్ర దర్యాప్తు, విచారణతోనే ఇందులో నిజంపాళ్లు ఎంతన్నది తెలిసే అవకాశం ఉంటుంది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది.
తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి (GJ Reddy) మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.