Mahesh Babu: టాలీవుడ్ టాప్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరుకారంలో నటిస్తున్నారు. కథలు, పాత్రలు, సినిమాలు ఎంచుకోవడంలో ఒత్తిడి ఉంటుంది. అందులోనూ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇంకా ఎక్కువ ఒత్తిడి ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమానికి మహేశ్ దంపతులు హాజరయ్యారు. మహేశ్ కేరీర్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.
‘నేను నటించిన చిత్రాలు ఫెయిల్ అయినప్పుడు నిరుత్సాహ పడతాను. ఎందుకంటే ఒక సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ సినిమా వెనుక ఎంతో మంది కష్టం దాగి ఉంటుంది. కాబట్టి దీని పూర్తి బాధ్యత తీసుకుంటాను. తర్వాతి చిత్రంపై ఎక్కువ దృష్టి పెడతాను. స్టార్ హీరో అయితే ఒత్తిడిని అంగీకరించాల్సిందేనని అన్నారు. ఈ విషయాన్ని తాను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నో విషయాలు ఆయన చెప్పేవారు. క్రమశిక్షణ, వినయం వంటి వాటి ప్రాముఖ్యత గురించి నేర్పించారు. విజయం ఒక్కసారిగా రాదు. ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంటేనే వస్తుందని మహేశ్ తన తండ్రిని గుర్తుచేసుకున్నారు.