స్వలింగ సంపర్కుల పెళ్లిలపై సుప్రీం కోర్టు (Supreme Court) కీలక తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణ అనంతరం నేడు తీర్పు ప్రకటించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్లపై 4 వేర్వేరు తీర్పులను ఇచ్చింది. ‘‘ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు చేయడం పార్లమెంటు (Parliament) విధి. కోర్టులు చట్టాలను తయారు చేయలేవు. స్వలింగ సంపర్కం .. నగరాలకో, సంపన్న వర్గాలకో పరిమితం కాదు. వివాహ చట్టంలో మార్పు అవసరమా కాదా అనేది పార్లమెంటు నిర్ణయిస్తుంది. స్వలింగ సంపర్కులపై వివక్ష చూపకూడదు.. అందరినీ సమానంగా చూడాలి.
భిన్న లింగ జంటలే మంచి తల్లిదండ్రులుగా ఉంటారని చట్టం భావించట్లేదు’’ అని సీజేఐ తెలిపారు.స్వలింగ వివాహాలను అంగీకరించడం సాధ్యం కాదని డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ వివాహాలను నేరంగా పరిగణించి పిటిషన్లు కొట్టివేసింది.ఈ వివాహాలను ప్రభుత్వంతో పాటు మతపెద్దలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని చెబుతున్నారు. స్వలింగ జంటలు, ఎల్జీబీటీక్యూ ప్లస్ కార్యకర్తలు, ఇతర సంస్థలు దాఖలు చేసిన 21 పిటిషన్లను కోర్టు విచారించింది.
ప్రతి ఒక్కరికీ జీవిత భాగస్వామి(Spouse)ని హక్కు ఉందని పేర్కొంది. వివాహ సమానత్వ కేసుపై క్వీర్ జంటపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సీజేఐ తెలిపారు. దీంతో పాటుగా.. వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే క్వీర్ కమ్యూనిటీ హక్కుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర పాలిత ప్రాంతాలు వివక్ష చూపకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.