దేశంలో దసరా, దీపావళి పండుగ(Diwali festival)లు సీజన్ మొదలైంది. చాలా మంది పండుగల సీజన్లో వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు ఆయా వాహనాలపై భారీగా డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటిస్తున్నాయి. హ్యుందాయ్(Hyundai)తో పాటు మారుతీ సుజుకీ కంపెనీ పలు మోడల్స్‌పై బంపర్ ఆఫర్‌ను ప్రకటించాయి. హ్యుందాయ్ ఆరా సీఎన్జీ వెర్షన్‌పై హ్యుందాయ్ రూ.33వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండగా ఇందులో రూ.20వేలు క్యాష్ డిస్కౌంట్ కాగా.. మరో రూ.10వేలు ఎక్స్ఛేంజ్ బోనస్ కాగా.. రూ.3వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నది.
అలాగే కాంపాక్ట్ సెడాన్‌కు చెందిన పెట్రోల్ వెర్షన్(Petrol version)పై రూ.10వేల వరకు క్యాష్ బోనస్, రూ.10వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది. ఇదిలా ఉండగా.. ఇటీవల హ్యుందాయ్ ఆరా కారు ధర రూ.12వేల వరకు పెరిగింది. అయితే, పెరిగిన దానికన్నా ఎక్కువగానే డిస్కౌంట్ (Discount) ఇస్తుండడం విశేషం. మారుతీ సుజుకీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది. దాదాపు న్ని మోడల్ కార్లపై భారీ తగ్గింపు ప్రకటించింది.
ప్రీ-నవరాత్రి బుకింగ్ స్కీమ్(Booking Scheme)లో భాగంగా ఇగ్నిస్, సియాజ్, బలెనో వంటి కార్ల బుకింగ్‌పై రూ. 5 వేల వరకు రాయితీని అందిస్తోంది.దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ మారుతి పండుగ సీజన్ నేపథ్యంలో నెక్సా, ఎరోనా మోడల్స్(Aerona Models)పై మంచి డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నది. ముఖ్యంగా సెలేరియోపై క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సెలేరియో వీఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ (ZXI) పెట్రోల్ ఎంటీపై రూ.35వేల వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.20వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.4వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నది.