Ola EV Year End Bumper Offer.. 20 thousand discount
Ola EV: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఈవీ (Ola electric) ఇయర్ ఎండ్ ఆఫర్లు ఇచ్చింది. ఓలా ఎస్1 ఎయిర్ (S1 Air), ఓలా ఎస్1 ఎయిర్ ప్రో (S1 Pro) కొనుగోలుపై రూ.10 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఓలా ఎస్1 ఎక్స్+ (Ola S1 X+)పై రూ.20వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఆఫర్ ప్రారంభం అయింది అయితే డిసెంబరు 17 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఓలా కంపెనీ తెలిపింది. ఓలా ఎస్1 స్కూటర్లలో ఎస్1 ఎయిర్, ఎస్1 ప్రో రెండు స్కూటర్లపై రూ.5వేల వరకు డిస్కౌంట్ కల్పించింది. ఓలా ఎస్1 ప్రో స్కూటర్కు ఐదేళ్ల బ్యాటరీ వారెంటీని ప్రకటించింది. క్రెడిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈఎంఐ సాయంతో కొనుగోలు చేసిన వాళ్లు అదనంగా రూ.5వేలు డిస్కౌంట్ కల్పించింది. జీరో డౌన్ పేమెంట్ ఛార్జీ, జీరో ప్రాసెసింగ్ ఫీ కూడా అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.