»Amazon Freedom Sale Open Huge Discount On These Phones
Amazon: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ ఓపెన్.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్
అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నారు.
Amazon Freedom Sale Open.. Huge discount on these phones
Amazon: ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) వినియోగదారుల కోసం తీసుకొచ్చిన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Great Freedom Festival sale) ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఆగస్టు 4 నుంచి సేల్ ప్రారంభం కావాల్సి ఉండగా ప్రైమ్ మెంబర్లకు 12 గంటల ముందే సేల్ షూరు అయింది. సేల్‌లో భాగంగా అందించే డిస్కౌంట్లు, డీల్స్‌లను ప్రైమ్ మొంబర్లు ముందుగానే పొందవచ్చు. దీనిలో భాగంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. కొన్ని స్మార్ట్ఫోన్లపై అమెజాన్ ఇస్తున్న ఆఫర్లు ఏంటో చూద్దాం.
శాంసంగ్ గెలాక్సీ M13 మొబైల్‌కు అమెజాన్ ఫ్రీడమ్ సేల్ భారీ ఎత్తున డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ఎమ్ఆర్పీ ధర రూ.14,999 ఉండగా సేల్‌లో భాగంగా రూ.9,464కే లభిస్తుంది. ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఒప్పో F23 5G ఫోన్‌పై రూ.2వేలు తగ్గిస్తూ ధర రూ.24,999 ఎమ్మార్పీ ఉన్న ఈ మొబైల్‌ను రూ.22,499కే అందిస్తోంది. ఇక వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్ ఫోన్‌ను వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో రూ.32,999కే విక్రయిస్తోంది. రియల్మీ నార్జో 60 ప్రో మొబైల్ ఫోన్ ప్రస్తుత ఎమ్మార్పీ రూ.23,999 ఉండగా ఈ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా రూ.22,999కే అంటే రూ. 1000 తగ్గించింది. అలాగే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అయిన గెలాక్సీ Z ఫోల్డ్ 5 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,64,999కి విక్రయిస్తుండగా.. సేల్‌లో భాగంగా రూ.1,55,999కే కొనుగోలు చేయొచ్చు. ఇక నాన్ ప్రైమ్ యూజర్లకు ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు ఈ సేల్ ఉంటుంది.