Flip Card Big Saving Days Sale.. 85 percent discount
Flipkart: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale)తో వినియోగదారులకు శుభవార్త ప్రకటించింది. ఆ బిగ్ సేవింగ్ సేల్ ఆగస్టు 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు కొనసాగనుందని వెల్లడించింది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్షిప్ యూజర్లు ఒక రోజు ముందుగానే ఈ సేల్‌లో పాల్గొనవచ్చని సంస్థ ప్రకటించింది. ఆగస్టు 4 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతున్న ఈ సేల్ ఆగస్టు 9 మధ్యాహ్నం 12 గంటల వరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ కార్డ్‌పై సూపర్ కాయిన్స్ పొందవచ్చు. ఇవే కాకుండా ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు క్రేజీ డీల్స్ పేరుతో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కొత్త ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి. ఫోర్ అవర్ డీల్స్ సేల్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకు ప్రత్యేకమైన ఆఫర్లు ఉండనున్నాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.
ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఎత్తున డిస్కౌంట్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్టాప్స్, స్మార్ట్‌వాచ్స్, దుస్తులు, ఫర్నిచర్‌పై 80 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్‌పై 75 శాతం, బ్యూటీ, ఫుడ్, టాయ్స్‌పై 85 శాతం వరకు డిస్కౌంట్లు అందించనుంది. ఫ్లిప్ కార్ట్ కన్నా ముందుగా మరో ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Great Freedom Festival sale)ను ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆగస్ట్ 5 నంచి 9 వరకు అనుకుంది. తాజాగా ఆగస్టు 4 నుంచి ఆగస్టు 8 వరకు ఈ సేల్ నిర్వహించనుంది. ప్రైమ్ కస్టమర్లకు 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.