స్టార్ హీరోయిన్ పూజా హెగ్గే గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతునే ఉంటుంది. చేతిలో సినిమాలు లేకపోయినా కూడా కోట్లకు కోట్లు పెట్టి ఏదో ఒకటి తీసుకుంటోందని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్గా 45 కోట్లనే న్యూస్ హాట్ టాపిక్ అయింది.
Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే బ్యాడ్ లక్ ఏంటో గానీ.. బడా బడా హీరోలతో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ సరైన హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. అంతేకాదు.. చాలా సినిమాల మధ్యలో నుంచే అమ్మడిని తప్పించేశారు. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మధ్యలోనే వెళ్లిపోయింది పూజా. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చాడు.
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా ప్లేస్‌ను శ్రీలీలతో భర్తీ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో ముందు నుంచి పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ లాగే శ్రీలీలను మెయిన్ హీరోయిన్గా తీసుకొని షాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. అలాగే.. రీసెంట్గా రవితేజ సినిమా ఆఫర్ కూడా పోయినట్టుగా చెబుతున్నారు. దీంతో ఇక తెలుగులో పూజా పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ప్రస్తుతం హిందీలో ఒకటి రెండు చిత్రాల్లో మాత్రమే నటిస్తోంది పూజా. అయినా కూడా ఏకంగా 45 కోట్లు విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసిందట బుట్టబొమ్మ. ముంబయిలోని బాంద్రా ఏరియాలో ఉన్న ఒక లగ్జరీ ఇంట్లోకి షిప్ట్ అవడానికి రెడీ అవుతోందట అమ్మడు. ఈ ఇల్లు సీ ఫేసింగ్‌తో ఉండటంతో పాటు.. దాదాపు 4000 స్క్వేర్ ఫీట్ విస్తీరణంతో ఉందట. అందుకే.. అన్నేసి కోట్లు ఖర్చు చేసినట్టుగా సమాచారం. ఏదేమైనా.. ఆఫర్లు తగ్గినా కూడా పూజా మాత్రం అస్సలు తగ్గేదేలే అంటోంది.