»Accused In Singer Sidhu Moosewala Murder Case Sachin Thapan Handed Over To Bharat
Singer Sidhu Moosewala: హత్య కేసులో నిందితుడు బారత్ కు అప్పగింత
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన సచిన్ బిష్ణోయ్(Sachin Bishnoi) అలియాస్ సచిన్ థాపన్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి భారత్‌కు రప్పించింది.
ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసు నిందితుడు సచిన్ బిష్ణోయ్(Sachin Bishnoi)ని అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ద్వారా భారత్‌కు రప్పించారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కీలక సహాయకుడు విక్రమ్‌జీత్ సింగ్ అలియాస్ విక్రమ్ బ్రార్‌ను యుఎఇ నుంచి భారతదేశానికి బహిష్కరించిన తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అరెస్టు చేసినట్లు బుధవారం ఒక అధికారి తెలిపారు. అతనిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి NIA నుంచి ఒక బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వెళ్లిందని ఒక ప్రకటనలో ఏజెన్సీ తెలిపింది. ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పాటు అమాయకులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడంలో అతని ప్రమేయం ఉందని NIA తెలిపింది.