ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న పోసాని ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.‘సీనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో ఆమె భార్య చనిపోయింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కు అండగా ఉండేందుకు లక్ష్మీ పార్వతి (Lakshmi Parvati) ఆయనను వివాహం చేసుకున్నారు.
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishnamurali) ఎన్టీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న పోసాని ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.‘సీనియర్ ఎన్టీఆర్ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో ఆమె భార్య చనిపోయింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌కు అండగా ఉండేందుకు లక్ష్మీ పార్వతి (Lakshmi Parvati) ఆయనను వివాహం చేసుకున్నారు. అలాంటి మహిళను పట్టుకుని చంద్రబాబు, టీడీపీ వాళ్లు ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. అదే లక్ష్మీ పార్వతిని తిట్టేవాళ్లకి హరికృష్ణ రెండో భార్య, తారక్ తల్లిని తిట్టే ధైర్యం లేదు. ఎందుకంటే అలా చేస్తే జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ఊరుకోరు. తారక్ ఇప్పుడు నంబర్ వన్ హీరో కాబట్టి భయపడుతున్నారు. పైగా అతనితో బాబుకు చాలా అవసరం ఉంది. చాలా వాంటెడ్ పర్సన్. తర్వాత ముఖ్యమంత్రి అవ్వగల కెపాసిటీ తారక్‌కే ఉంది. అందుకే జూనియర్‌ను ఏమీ అనడం లేదు. అతనితో మంచిగా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయి’ అని కామెంట్స్ చేశారు పోసాని.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్.. టాలీవుడ్లో (Tollywood)ఈ స్టార్ హీరోకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు తారక్. సినిమాల విషయం పక్కన పెడితే.. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ పేరు తరచూ వినిపిస్తుంటుంది. తాత పోలికలతో ఉన్న తారక్ రాజకీయాల్లోనూ సత్తా చాటుతాడని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణుల్లో చాలామంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కి సీఎం అయ్యే సత్తా కూడా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh)కూడా పాలిటిక్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తారక్ మాత్రం రాజకీయాలకు ఇంకా చాలా సమయం ఉందంటున్నారు. ప్రస్తుతం తన దృష్టంతా సినిమాలపైనే ఉందంటున్నారు.